'మహానటి' వెనక్కి వెళుతుందా!
Send us your feedback to audioarticles@vaarta.com
మహానటి సావిత్రి జీవితం ఆధారంగా `మహానటి` సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. టైటిల్ రోల్‌లో కేరళకుట్టి కీర్తి సురేష్ నటిస్తోంది. `ఎవడే సుబ్రమణ్యం` ఫేమ్ నాగ్ అశ్విన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాను మార్చి 29న విడుదల చేస్తారని తెలిసిందే. అయితే ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు పెండింగ్‌లో ఉన్నాయట. ముఖ్యంగా సీజీ వర్క్ చాలా చేయాల్సి ఉందట. అవన్నీ పూర్తి చేస్తే కానీ సినిమాకు పరిపూర్ణత చేకూరదు. కాబట్టి సినిమాకు సంబంధించిన పనులను పూర్తి చేసి వేసవిలో విడుదల చేయాలని యూనిట్ భావిస్తుందని సమాచారం.
ఈ సినిమాలో ఎస్వీఆర్‌గా మోహన్‌బాబు నటిస్తుండగా.. సమంత, షాలినీ పాండే, విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్, ప్రకాష్ రాజ్ ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా వినిపిస్తున్న కథనాల ప్రకారం.. ఈ సినిమాలో మాయాబజార్ చిత్రానికి సంబంధించిన కీలక ఘట్టాలు ఉంటాయట. ఆ చిత్రానికి దర్శకుడు అయిన కె.వి.రెడ్డి పాత్రలో ప్రముఖ దర్శకుడు క్రిష్ నటిస్తుండగా.. కె.వి.రెడ్డి అసిస్టెంట్ అయిన మరో ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు పాత్రలో పెళ్లి చూపులుకి దర్శకత్వం వహించిన తరుణ్ భాస్కర్ కనిపించనున్నారని తెలిసింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com