మహానటి షూటింగ్ పూర్తి

  • IndiaGlitz, [Thursday,March 22 2018]

కీర్తి సురేష్ టైటిల్ పాత్రలో నటిస్తున్న చిత్రం మహానటి. లజండరీ కథానాయకి సావిత్రి జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి నాగఅశ్విన్ దర్శకత్వం వహిస్తుండగా వైజయంతీ మూవీస్-స్వప్న సినిమా సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం చిత్రీకరణ పూర్తి చేసుకొంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా పూర్తి చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ చిత్రం నిన్న సెట్ లో గుమ్మడికాయ కొట్టుకొంది. 

ఈ సందర్భంగా చిత్ర నిర్మాత ప్రియాంక దత్ మాట్లాడుతూ.. మా టెక్నికల్ టీమ్ ఎంతో నేర్పుతో క్రియేట్ చేసిన బ్లాక్ అండ్ వైట్ ఎరా ప్రేక్షకుల్ని ఆశ్చర్యానికి గురి చేయడమే కాక అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ను ఇస్తుంది. ఏ విషయంలోనూ రాజీపడకుండా మహానటి లాంటి అద్భుతమైన చిత్రాన్ని నిర్మించినందుకు గర్వపడుతున్నాం.

కీర్తి సురేష్, సమంత, మోహన్ బాబు, రాజేంద్రప్రసాద్, దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ, ప్రకాష్ రాజ్, షాలిని పాండే, మాళవిక నాయర్, భానుప్రియ, దివ్యవాణి, శ్రీనివాస్ అవసరాల, దర్శకులు క్రిష్, తరుణ్ భాస్కర్ వంటి వారితో కలిసి మా బ్యానర్ లో వర్క్ చేయడం చాలా ఆనందంగా ఉంది. ఏయన్నార్ పాత్రలో నటించిన అక్కినేని నాగచైతన్యకు ఎప్పటికీ ఋణపడి ఉంటాం.

మాకోక స్ట్రాంగ్ సపోర్ట్ గా మోహన్ బాబుగారు, రాజేంద్రప్రసాద్ గారు నిలబడ్డారు. వారితో కలిసి పనిచేసిన ప్రతి నిమిషం మాకు అపురూపమైనది. ఆఖరి రోజున ఆఖరి సన్నివేశం చిత్రీకరణ పూర్తయిన తర్వాత గుమ్మడికాయ పూజలో భాగంగా సావిత్రిగారి పటం వద్ద ప్రతిమ వెలిగిస్తున్న తరుణంలో కనీరు పెట్టుకొంది. మే 9న విడుదలవుతున్న ఈ చిత్రం ప్రేక్షకులకు ఒక మరపురాని అనుభూతిని మిగుల్చుతుంది అన్నారు. 

ఈ చిత్రానికి సంగీతం: మిక్కీ జె.మేయర్, ప్రొడక్షన్ డిజైన్: శివం, ఆర్ట్ డైరెక్టర్: అవినాష్, స్టైలిస్ట్: ఇంద్రాక్షి, సినిమాటోగ్రఫీ: డాని, ఆర్ట్ సూపర్విజన్: తోట తరణి, ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వర్రావు, నిర్మాత: ప్రియాంక దత్, దర్శకత్వం: నాగఅశ్విన్.

More News

ఆ లిస్ట్‌లో ఉపేంద్ర మాధ‌వ్ చేరుతాడా?

కొత్త ద‌ర్శ‌కుల‌ను ప్రోత్స‌హించ‌డం.. వాళ్ళ‌తో సినిమాలు చేసి, విజ‌యాల‌ను అందుకోవ‌డం క‌ళ్యాణ్‌రామ్‌కు కొత్తేం కాదు.

'ప్రశ్నిస్తా' సినిమా ప్రారంభం

జనం ఎంటర్టైన్మెంట్ పతాకంపై ప్రముఖనిర్మాత సత్య రెడ్డి నిర్మిస్తున్న 'ప్రశ్నిస్తా' మూవీ కి తన కుమారుడైన మనీష్ బాబు ని హీరోగా పరిచయం

రెండోసారి కూడా అలాగే..

హైప‌ర్‌, ఉన్న‌ది ఒక‌టే జింద‌గీ ఫ‌లితాల‌తో నిరాశ‌పడ్డ యువ క‌థానాయ‌కుడు రామ్‌.. త‌దుప‌రి చిత్రాల విష‌యంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు.

చంద్ర‌బాబు చేతుల మీదుగా జొన్న‌విత్తుల ప‌ద్య వాద్య క‌చేరి విడుద‌ల‌

తెలుగు పదాలకు పద్యాలకు వన్నె తెచ్చిన కవులు మన చరిత్రలో చాలా మందే వున్నారు.

45 దియోట‌ర్స్ లో 50 రోజులు పూర్తి చేసుకున్న'ఛ‌లో'

నాగ‌సౌర్య హీరోగా, ర‌ష్మిక హీరోయిన్‌గా వెంకి కుడుముల ని ద‌ర్శ‌కుడుగా ప‌రిచ‌యం చేస్తూ ఐరా క్రియేషన్స్ బ్యానర్లో శంకర్ ప్రసాద్ స‌మ‌ర్ప‌ణ‌లో, ఉష నిర్మాతగా  నిర్మించిన చిత్రం ఛ‌లో..