'మహానటి'.. కొన్ని సీన్స్ మాత్రమే
Send us your feedback to audioarticles@vaarta.com
నటీమణి సావిత్రి జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం 'మహానటి'. సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ నటిస్తున్న ఈ సినిమాలో విజయ్ దేవరకొండ, సమంత, మోహన్ బాబు, దుల్కర్ సల్మాన్, షాలినీ పాండే, ప్రకాష్ రాజ్, భాను ప్రియ, క్రిష్, తరుణ్ భాస్కర్, దివ్య వాణి తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాని ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ సమర్పిస్తోంది. మిక్కీ జే మేయర్ సంగీత దర్శకత్వం వహిస్తున్నారు.
మే 9న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదిలా ఉంటే.. ఈ సినిమా టీజర్‌ను ఇటీవల విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇందులో కొన్ని షాట్స్ బ్లాక్ అండ్ వైట్‌లో కనిపిస్తాయి. సావిత్రి అంటే.. బ్లాక్ అండ్ వైట్ సినిమాల కాలం నటి కాబట్టి.. సినిమా కూడా ఆ కలర్స్‌లోనే ఉంటుందేమో అన్న సందేహం రావడం సహజం. అయితే.. ఈ సినిమాలో కొన్ని షాట్స్, సీన్స్ మాత్రమే బ్లాక్ అండ్ వైట్‌లో ఉంటాయని.. సినిమా దాదాపు కలర్‌ఫుల్‌గానే సాగుతుందని చిత్ర సన్నిహిత వర్గాలు చెప్పుకొస్తున్నాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments