మహానటి కి అరుదైన గౌరవం.. ఇండియన్ పనోరమాకి ఎంపిక
Send us your feedback to audioarticles@vaarta.com
వైజయంతీ మూవీస్, స్వప్న సినిమాస్ సంయుక్తంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన చిత్రం `మహానటి.` సావిత్రి జీవిత కథ `మహానటి`గా తీర్చిదిద్దితే... తెలుగు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. వసూళ్లతో నీరాజనాలు అందించారు. విమర్శకుల ప్రశంసలూ లభించాయి. ఇప్పుడు మహానటికి అరుదైన గౌరవం దక్కింది. ఇండియన్ పనోరమాలో తెలుగు చిత్రసీమ నుంచి ప్రదర్శన కోసం `మహానటి` ఎంపికైంది. కీర్తి సురేష్, సమంత, దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రానికి నాగ అశ్విన్ దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే.
49వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (ఐఎఫ్ ఎఫ్ ఐ) ఉత్సవాలు త్వరలో గోవాలో జరగనున్నాయి. అందులో భాగంగా `మహానటి`ని ప్రదర్శిస్తారు. హిందీ, తమిళ, మలయాళం, తుళు... ఇలా భారతీయ భాషల నుంచి 22 చిత్రాలు నాన్ ఫీచర్ ఫిల్మ్స్ ఈ చిత్రోత్సవాల్లో ప్రదర్శనకు నోచుకున్నాయి. మెయిన్ స్ట్రీమ్ లో మాత్రం భారతదేశం నుంచి నాలుగే చిత్రాల్ని ప్రదర్శనకు ఎంపిక చేశారు. అందులో దక్షిణాది నుంచి ఒక్క `మహానటి`కే స్థానం దక్కింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Diya Harini
Contact at support@indiaglitz.com