'మహానటి' లో జెమిని గణేషన్ ఎలా ఉంటారంటే...
Friday, July 28, 2017 తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com
Send us your feedback to audioarticles@vaarta.com
తెలుగు, తమిళ ప్రేక్షకులకు దగ్గరైన స్టార్ హీరోయిన్ ఇప్పుడు బిజి బిజీగా ఉంది. ప్రస్తుతం పవన్‌కళ్యాణ్ సినిమాలో నటిస్తున్న కీర్తి సురేష్ నాగాశ్విన్ దర్శకత్వంలో `మహానటి` సినిమాలో నటించనుంది. అలనాటి మహానటి సావిత్రి జీవితకథ ఆధారంగా తెరకెక్కనున్న ఈ సినిమాలో మరో స్టార్ హీరోయిన్ సమంత జర్నలిస్ట్ పాత్రలో నటిస్తుంది.
ఈ సినిమాలో సావిత్రి భర్త జెమిని గణేషన్ పాత్రలో మలయాళ యంగ్ స్టార్ దుల్కర్ సల్మాన్ నటిస్తున్నారు. జెమినిగణేషన్ అసలు మహానటిలో ఎలా కనపడబోతున్నారనే దానికి ఈ రోజు క్లారిటీ వచ్చింది. జెమినిగణేషన్ లుక్‌లోని దుల్కర్ లుక్‌ను ఈరోజు విడుదల చేశారు. దుల్కర్ దాదాపు జెమిని గణేషన్‌కు దగ్గరగా ఉండేలా లుక్ విషయంలో కేర్ తీసుకున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments