మంత్రిని ప్ర‌శ్నించిన మ‌హాన‌టి ద‌ర్శ‌కుడు

  • IndiaGlitz, [Tuesday,November 27 2018]

ద‌ర్శ‌కుడు నాగ్ అశ్విన్ మంత్రి కేటీఆర్‌ను ఓ విష‌యంలో సోషల్ మీడియా ద్వారా ప్ర‌శ్నించారు. వివ‌రాల్లోకెళ్తే.. నాగ్ అశ్విన్ స్నేహితుడు కెమెరామెన్‌గా ప‌నిచేస్తున్నారు. ఆదివారం స‌దురు కెమెరామెన్ తీవ్రంగా గాయ‌ప‌డితే ఆయ‌న్ను ద‌గ్గ‌ర‌లోని గాంధీ హాస్పిట‌ల్‌కు తీసుకెళ్లార‌ట‌. డాక్ట‌ర్లు అందుబాటులో లేక‌పోవ‌డంతో... ఆ కెమెరామెన్ చ‌నిపోయాడు. ఈ విష‌యం తెలుసుకున్న నాగ్ అశ్విన్ కేటీఆర్‌కు విష‌యాన్ని వివ‌రించారు. ''ఆదివారం నా స్నేహితుడికి రోడ్డు ప్ర‌మాదం జ‌రిగితే గాంధీ హాస్పిట‌ల్‌కు త‌ర‌లించాం.

మూడు గంట‌లు పాటు అత‌ను డాక్ట‌ర్లు అందుబాటులో లేక ప్రాణాల‌తో కొట్టు మిట్టాడుతూ చ‌నిపోయాడు. అత‌న్ని త‌ల్లిదండ్రులే స్ట్రెచ‌ర్‌పై ప‌డుకోబెట్టి తిరిగారు. ఆ స‌మ‌యంలో మ‌రేదైనా హాస్పిట‌ల్‌కు తీసుకెళ్లినా బ్ర‌తికేవాడు. తెలంగాణ రాష్ట్ర రాజ‌ధానిలో ఓ ప్ర‌భుత్వాసుప‌త్రిలో మ‌నుషుల ప్రాణాల‌ను ఎందుకు కాపాడుకోలేం.

గ‌వ‌ర్న‌మెంట్ హాస్పిట‌ల్ అంటే చావుకు ప‌ర్యాయ‌ప‌దం కాద‌ని చెప్ప‌డానికి ఏం చేయ‌మంటారో మీరే చెప్పండి. నా స్నేహితుడు గొప్ప కెమెరామెన్‌. దీని గురించి ఎవ‌రిని ప్ర‌శ్నించాలో అర్థం కావ‌డం లేదు స‌ర్‌. వైద్యం అంద‌క అలా ఎవ‌రూ చ‌నిపోకూడ‌దు '' అంటూ పోస్ట్ చేశారు నాగ్ అశ్విన్‌. దీనిపై మంత్రి కేటీఆర్ ఎలా స్పందిస్తారో చూడాలి.

More News

'క‌వ‌చం' వాయిదా

బెల్లంకొండ శ్రీనివాస్‌, కాజ‌ల్ అగ‌ర్వాల్, మెహ‌రీన్ హీరో హీరోయిన్లుగా  న‌టిస్తోన్న చిత్రం 'క‌వచం'.  బెల్లంకొండ శ్రీనివాస్  ఇందులో ప‌వ‌ర్ ఫుల్ పోలీస్ ఆఫీస‌ర్ గా న‌టిస్తున్నారు.

అసత్య ఆరోప‌ణ‌లు ఆప‌మంటున్నహీరోయిన్‌

త‌మిళ న‌టి గాయ‌త్రి ర‌ఘురాం త‌ప్ప తాగి డ్రైవింగ్ చేస్తూ ఆడ‌యార్‌లో పోలీసుల‌కు చిక్కింది. పోలీసుల‌తో వాగ్వాదం చేసింది.

చివ‌రి షెడ్యూల్‌లో 'య‌న్‌.టి.ఆర్‌'

టాలీవుడ్‌లో మోస్ట్ అవెయిటెడ్ మూవీస్‌లో ఎన్టీఆర్ బయోపిక్ ఒక‌టి. ఈ దివంగ‌త ముఖ్య‌మంత్రి జీవిత చ‌రిత్ర‌ను 'య‌న్‌.టి.ఆర్ క‌థానాయ‌కుడు'

మెహ‌రీన్‌ పై ప్రొడ్యూస‌ర్స్ కౌన్సిల్‌ లో పిర్యాదు

పంజాబీ ముద్దుగుమ్మ మెహ‌రీన్ కౌర్‌కి ఈ మ‌ధ్య స‌రైన హిట్ చిత్రాలు రావ‌డం లేదు. దీంతో చిత్రాల ఎంపిక‌లో మ‌రీ అచి తూచి అడుగులు వేయ‌డానికి మెహ‌రీన్ ఆలోచిస్తుంది.

సాఫ్ట్ వేర్ స్కాండల్‌ పై చిత్రం

సాఫ్ట్‌వేర్ ఇండ‌స్ట్రీస్‌లో ఒక‌ప్పుడు స‌త్యం అంటే ఓ పేరుండేది. ఆ సంస్థ అధినేత స‌త్యం రామ‌లింగ‌రాజు నిధులను దుర్వినియోగం చేశారు.