మంత్రిని ప్రశ్నించిన మహానటి దర్శకుడు
Send us your feedback to audioarticles@vaarta.com
దర్శకుడు నాగ్ అశ్విన్ మంత్రి కేటీఆర్‌ను ఓ విషయంలో సోషల్ మీడియా ద్వారా ప్రశ్నించారు. వివరాల్లోకెళ్తే.. నాగ్ అశ్విన్ స్నేహితుడు కెమెరామెన్‌గా పనిచేస్తున్నారు. ఆదివారం సదురు కెమెరామెన్ తీవ్రంగా గాయపడితే ఆయన్ను దగ్గరలోని గాంధీ హాస్పిటల్‌కు తీసుకెళ్లారట. డాక్టర్లు అందుబాటులో లేకపోవడంతో... ఆ కెమెరామెన్ చనిపోయాడు. ఈ విషయం తెలుసుకున్న నాగ్ అశ్విన్ కేటీఆర్‌కు విషయాన్ని వివరించారు. ``ఆదివారం నా స్నేహితుడికి రోడ్డు ప్రమాదం జరిగితే గాంధీ హాస్పిటల్‌కు తరలించాం.
మూడు గంటలు పాటు అతను డాక్టర్లు అందుబాటులో లేక ప్రాణాలతో కొట్టు మిట్టాడుతూ చనిపోయాడు. అతన్ని తల్లిదండ్రులే స్ట్రెచర్‌పై పడుకోబెట్టి తిరిగారు. ఆ సమయంలో మరేదైనా హాస్పిటల్‌కు తీసుకెళ్లినా బ్రతికేవాడు. తెలంగాణ రాష్ట్ర రాజధానిలో ఓ ప్రభుత్వాసుపత్రిలో మనుషుల ప్రాణాలను ఎందుకు కాపాడుకోలేం.
గవర్నమెంట్ హాస్పిటల్ అంటే చావుకు పర్యాయపదం కాదని చెప్పడానికి ఏం చేయమంటారో మీరే చెప్పండి. నా స్నేహితుడు గొప్ప కెమెరామెన్. దీని గురించి ఎవరిని ప్రశ్నించాలో అర్థం కావడం లేదు సర్. వైద్యం అందక అలా ఎవరూ చనిపోకూడదు `` అంటూ పోస్ట్ చేశారు నాగ్ అశ్విన్. దీనిపై మంత్రి కేటీఆర్ ఎలా స్పందిస్తారో చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout