రవితేజతో మహాలక్ష్మి

  • IndiaGlitz, [Saturday,December 10 2016]

హ‌ను రాఘ‌వ‌పూడి కృష్ణ‌గాడి వీర ప్రేమ‌గాథ చిత్రంలో మ‌హాల‌క్ష్మిగా ప‌రిచ‌య‌మైన పంజాబీ భామ మెహ‌రీన్ ఇప్పుడు తెలుగులో వ‌రుస అవ‌కాశాల‌తో బిజీ అవుతుంది. త్వ‌ర‌లో ప్రారంభం కానున్న శ‌ర్వానంద్‌, మారుతిల చిత్రంలో న‌టించ‌బోతున్న ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు ర‌వితేజతో కూడా జోడి క‌ట్ట‌నుంద‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి.

ఈ ఏడాది అస‌లు సినిమాలే చేయ‌ని మాస్ మ‌హారాజా ర‌వితేజ ఇప్పుడు అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో సినిమా చేయ‌బోతున్నాడు. ఈ సినిమాలో ర‌వితేజ స‌ర‌స‌న మెహ‌రీన్ హీరోయిన్‌గా న‌టించ‌నుంద‌ట‌. జ‌న‌వ‌రిలో ఈ సినిమాలో సెట్స్‌లోకి వెళ్ల‌నుంద‌ట‌. ఈ చిత్రంలో ర‌వితేజ్ ఓ డిఫ‌రెంట్ క్యారెక్ట‌ర్‌లో క‌న‌ప‌డ‌నున్నాడ‌ట‌.