వరదలో చిక్కుకున్న ‘మహాలక్ష్మి ఎక్స్‌ప్రెస్’.. ఆందోళన ప్రయాణికులు!
Send us your feedback to audioarticles@vaarta.com
మహారాష్ట్రలో ముంబై - కొల్హాపూర్ మధ్య వాంగ్నీ ప్రాంతంలో ‘మహాలక్ష్మి ఎక్స్‌ప్రెస్’ వరదనీటిలో చిక్కుకుంది. ఈ రైల్లో మొత్తం 700 మంది ప్రయాణీకులు ఉన్నట్లు తెలుస్తోంది. మొదట 2000 మంది ప్రయాణీకులు ఉన్నట్లు ప్రమాదం జరిగిన తర్వాత అధికారులు గుర్తించినప్పటికి ఆ తర్వాత క్లారిటీ ఇచ్చారు. కాగా 2 అడుగులు మేర వరద నీరు రైల్వే ట్రాక్‌పై నిలిచిపోయాయి. దీంతో రైలు అటు ఇటు కదల్లేని పరిస్థితి. ఈ ఘటన శనివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. రైలు నుంచి బయటపడేందుకు ప్రయాణీకులు నానా విధాలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఒకట్రెండు కాదు ఏకంగా భయం గుప్పిట్లో బతుకుతున్నారు.
మరోవైపు నీటిలో కొట్టుకువచ్చే పాములు, విషకీటకాలు ఎక్కడ బోగీల్లోకి వస్తాయోనని ప్రయాణికులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు.. ఇటు సిటీ పోలీసులు.. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది అందరూ రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపడుతున్నారు. ప్రస్తుతం ఇప్పటి వరకు సుమారు 300 మంది ప్రయాణికులను రక్షించారు. హెలికాప్టర్లు, పడవల ద్వారా అక్కడికి చేరుకుని ప్రయాణికులను సురక్షిత ప్రాంతాలకు చేరుస్తున్నారు. కాగా.. గడిచిన 24 గంటల్లో 150 నుంచి 180మి.మీ వర్షపాతం నమోదైనట్లు వాతావరణ విభాగం ఓ ప్రకటనలో తెలిపింది. దీంతో శుక్రవారం నుంచి విమానాలు, రైళ్లను దారి మళ్లించినట్లు అధికారులు తెలిపారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments