యాదాద్రిలో కన్నుల పండుగగా మహా కుంభ సంప్రోక్షణ... కేసీఆర్ ప్రత్యేక పూజలు
Send us your feedback to audioarticles@vaarta.com
యాదాద్రిలో ఆలయ ఉద్ఘాటన ప్రక్రియ ఘనంగా జరుగుతోంది. దీనిలో భాగంగా కీలకమైన మహా కుంభ సంప్రోక్షణ కన్నుల పండుగగా కొనసాగింది. దివ్య విమాన గోపురంపై శ్రీ సుదర్శన చక్రానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో సంప్రోక్షణ నిర్వహించారు. మిథున లగ్నంలో ఏకాదశి సందర్భంగా 11.55 గంటలకు ఈ మహోత్సవం జరుపుతున్నారు. దీనిలో భాగంగా శ్రీ సుదర్శన చక్రానికి యాగజలాలతో సంప్రోక్షణ చేశారు. ప్రధానాలయం గోపురాలపై కలశాలకు కుంభాభిషేకం నిర్వహించారు. అలాగే 7 గోపురాలపై ఉన్న కలశాలకు కుంభాభిషేకం, సంప్రోక్షణ చేశారు. ఆలయ రాజగోపురాలపై స్వర్ణ కలశాలకు 92 మంది రుత్వికులతో సంప్రోక్షణ జరిపారు. అనంతరం సీఎం కేసీఆర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు.
మిగిలిన ఆలయ గోపురాలకు శాసనసభ స్పీకర్, మండలి ఛైర్మన్, మంత్రులు ఆధ్వర్యంలో సంప్రోక్షణ కార్యక్రమాలు నిర్వహించారు. మధ్యాహ్నం 12.20 నిమిషాల నుంచి గర్భాలయంలోని మూలవరుల దర్శనానికి అనుమతించారు. అనంతరం సీఎం కేసీఆర్ దంపతులు స్వామివారికి తొలిపూజ చేయనున్నారు. మధ్యాహ్నం 3 గంటల తర్వాత సర్వదర్శనానికి భక్తులను అనుమతిస్తారు. యాదాద్రి ఆలయ ఉద్ఘాటన, సీఎం సహా ప్రముఖుల రాక నేపథ్యంలో కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. రాచకొండ సీపీ మహేశ్ భగవత్, భువనగిరి డీసీపీ నారాయణరెడ్డి ఆదివారం భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించారు. ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా రూట్‌మ్యాప్ రూపొందించారు. ప్రత్యేకంగా పార్కింగ్ ఏర్పాట్లు చేస్తున్నారు. కొండ కింద నుంచి పైకి రవాణా సౌలభ్యం కోసం ఆర్టీసీ అధికారులు ‘యాదాద్రి దర్శిని’ బస్సులను ఏర్పాటు చేసింది.
ఇక ఆలయం విషయానికి వస్తే..
ఇక్కడి పంచనార సింహుల క్షేత్రం ఒకప్పటిలా గుహాలయం మాత్రమే కాదు.. ఇప్పుడది దేశంలోనే తొలిసారిగా పూర్తిగా కృష్ణ శిలలతో నిర్మితమైన ఆలయం. రెండున్నర లక్షల టన్నుల కృష్ణశిలలతో.. ఇద్దరు స్థపతులు, 12 మంది ఉపస్థపతులు, 800 మంది శిల్పులు.. 1500 మంది కార్మికులు.. 66 నెలల పాటు శ్రమించి అద్భతాన్ని ఆవిష్కరించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments