మహాభారత్‌లో ‘భీముడు’ ప్రవీణ్ కుమార్ ఇక లేరు
Send us your feedback to audioarticles@vaarta.com
ఓ 30 ఏళ్లు వెనక్కి వెళితే.. అప్పుడప్పుడే భారత్‌లో టీవీలు రంగ ప్రవేశం చేస్తున్న కాలం. దూరదర్శన్ తప్పించి మరో ఛానెల్ లేని సమయం. ఆ సమయంలో భారతీయులకు వినోదాన్ని పంచిన ధారావాహిక.. ‘‘మహాభారతం’’. బీఆర్ చోప్రా నిర్మించిన ఈ సీరియల్ 1988 నుంచి 1990 మధ్య యావత్ దేశాన్ని అలరించింది. ఇంటిల్లిపాదితో పాటు చుట్టుపక్కల వారు టీవీ సెట్ల ముందు కూర్చొని భక్తి పారవశ్యంలో మునిగిపోయేవారు. ఈ సీరియల్లో నటించిన వారు అప్పట్లో బాగా ఫేమస్. ఆ పాపులారిటీతోనే సినిమాల్లో అవకాశాలు దక్కించుకున్నారు. ‘‘మహాభారత్’’లో భీముడి పాత్రతో కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్న ప్రవీణ్ కుమార్ సోబ్తీ ఇక లేరు. గుండెపోటుతో సోమవారం రాత్రి 10.30 గంటల సమయంలో ఆయన కన్నుమూశారు. ఈ విషయాన్ని ప్రవీణ్ కుమార్తె నికునికా మీడియాకు తెలిపారు.
ప్రవీణ్ .. ఆహార్యం, హైట్ నిజంగా భీముడు అంటే ఇలాగే ఉంటాడా అన్న భావన ప్రేక్షకుల్లో కలిగించింది. మహాభారత్‌తో పాటు బాలీవుడ్లో 50 కిపైగా చిత్రాల్లో నటించారు. 1990లో కమల్‌హాసన్ నటించిన ‘మైఖెల్ మదన్ కామరాజు’ సినిమాతో తెలుగు, తమిళ ప్రేక్షకులను కూడా పలకరించారు ప్రవీణ్. పంజాబ్‌కు చెందిన ప్రవీణ్ కుమార్ సోబ్తీ.. కేవలం నటుడు మాత్రమే కాదు.. హ్యామర్, డిస్క్‌త్రోలో కూడా ఛాంపియన్. ఆయన హాంకాంగ్‌లో జరిగిన ఆసియా, కామన్వెల్త్ క్రీడల్లో భారత్ తరపున పాల్గొని పలు పతకాలను సాధించారు. అంతేకాకుండా ఒలింపిక్స్‌లోనూ దేశానికి రెండుసార్లు ప్రాతినిధ్యం వహించారు ప్రవీణ్ కుమార్.
క్రీడలు, సినిమాలు, సీరియల్స్‌కే పరిమితం కాకుండా ఆయన రాజకీయాల్లోనూ ప్రవేశించారు. 2013లో జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అనంతరం 2014లో బీజేపీ తీర్ధం పుచ్చుకున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com