మహాశివరాత్రి కానుకగా 'సతీ తిమ్మమాంబ' విడుదల

  • IndiaGlitz, [Wednesday,February 17 2016]

ఎస్‌.ఎస్‌.ఎస్‌. ఆర్ట్‌ క్రియేషన్స్‌ పతాకంపై బాలగొండ ఆంజనేయులు దర్శకత్వంలో భవ్యశ్రీ ప్రధాన పాత్రలో నిర్మాత పెద్దరాసు సుబ్రమణ్యం నిర్మించిన హిస్టారికల్‌ మూవీ 'సతీ తిమ్మమాంబ'. భారీ గ్రాఫిక్స్‌తో ముస్తాబైన ఈ మూవీని మహాశివరాత్రి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

ఈ సందర్భంగా

చిత్ర దర్శకుడు బాలగొండ ఆంజనేయులు మాట్లాడుతూ..'అనంతపురం జిల్లా కదిరి ప్రాంతంలో ఏడెకరాల భూమిలో ఎంతో విశిష్టత కలిగిన తిమ్మమ్మ మర్రిమాను చరిత్ర ఆధారంగా తెరకెక్కిన చిత్రమిది. ఈ చిత్ర నిర్మాణం కోసం నిర్మాత పెద్దరాసు సుబ్రమణ్యంగారు అందించిన సహకారం మరిచిపోలేను. అలాగే ఆర్టిస్ట్‌లు, సాంకేతిక నిపుణులు ఈ చిత్రం కోసం ఎంతగానో కష్టపడ్డారు. అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయి. మహాశివరాత్రి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నాము..' అని అన్నారు.

నిర్మాత పెద్దరాసు సుబ్రమణ్యం మాట్లాడుతూ..''సుమారు 600 వందల సంవత్సరాల చరిత్ర కలిగిన తిమ్మమ్మ మర్రిమాను చరిత్రను చలనచిత్రంగా తెరకెక్కించినందుకు ఎంతగానో సంతోషిస్తున్నాను. గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌లో ఈ మర్రిమాను చోటు సంపాదించుకుంది అంటే..ఈ మానుకు ఎటువంటి చరిత్ర ఉందో తెలుసుకోవచ్చు. ఆ చరిత్రను ప్రజలకు తెలియజేయాలనే సంకల్పంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించాము. మహాశివరాత్రికి ఈ తిమ్మమాను దగ్గర పెద్ద జాతర జరుగుతుంది. 'థేరు' ఉత్సవంగా పేరున్న ఈ జాతరను అనంతపురంకి సంబంధించిన మినిస్టర్స్‌ ప్రారంభిస్తారు. సుమారు మూడు రోజుల పాటు ఈ ఉత్సవం జరుగుతుంది. తిమ్మమ్మ అత్తింటి వారు శైవులు. అంటే శివుని ఆరాధించేవారు. రాష్ట్ర నలుమూలల నుండి పాల్గొనే ప్రజల శివనామస్మరణతో ఈ మూడు రోజుల ఉత్సవం ఎంతో విశిష్టతను సంతరించుకుంటుంది. ఈ విశిష్టతను పురస్కరించుకునే..మా ఈ 'సతీ తిమ్మమాంబ' చిత్రాన్ని మహాశివరాత్రి కానుకగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాము. ఆద్యంతం ప్రేక్షకులను ఆకట్టుకునేలా..భారీ గ్రాఫిక్స్‌తో ఈ చిత్రాన్ని తీర్చిదిద్దాము. ప్రేక్షకుల్ని, భక్తుల్ని ఈ చిత్రం అలరిస్తుందని ఆశిస్తున్నాము..' అని అన్నారు.

More News

'కృష్ణగాడి వీర ప్రేమగాథ' చిత్రయూనిట్ ను అభినందించిన - బాలకృష్ణ

నటసింహ నందమూరి బాలకృష్ణ ప్రసాద్ ల్యాబ్స్ లో,నాని,మెహరీన్ జంటగా నటించిన చిత్రం‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’చిత్ర స్పెషల్ షో ను వీక్షించారు.

అభిమాని సినిమా చూస్తున్న బాలయ్య...

నాని హీరోగా నటించిన 'కృష్ణగాడి వీర ప్రేమగాథ' చిత్రం రీసెంట్ గా రిలీజ్ మంచి విజయాన్ని అందుకుంది.

రకుల్ కూడా బిజినెస్ పెట్టేసింది....

ప్రస్తుతం సినిమా రంగంలోని నటీనటులందరూ తమ ఆదాయాన్ని హోటల్స్,ఫ్యాషన్ డిజైనింగ్ రంగాల్లో ఇన్ వెస్ట్ చేస్తున్నారు.

ప్ర‌భాస్ నెక్ట్స్ మూవీ బ‌డ్జెట్ ఎంత‌

యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ ప్ర‌స్తుతం బాహుబ‌లి 2 మూవీలో న‌టిస్తున్నారు. ద‌ర్శ‌క‌థీర రాజ‌మౌళి ఈ చిత్రాన్నిఅత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కిస్తున్నారు.

'ప‌డ‌సావే' సెన్సార్ పూర్తి

అక్కినేని నాగార్జున ప్రోత్సాహంతో అయాన్ క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై చునియా ద‌ర్శ‌క‌త్వంలో కార్తీక్ రాజు,నిత్యాశెట్టి, శామ్ హీరో హీరోయిన్లుగా రూపొందుతోన్న చిత్రం ‘ప‌డేసావే’.