'మహాసముద్రం' ఆగస్ట్ 19న విడుదల
Send us your feedback to audioarticles@vaarta.com
శర్వానంద్, సిద్ధార్థ్ హీరోలుగా అజయ్ భూపతి దర్శకత్వంలో రూపొందుతోన్న 'మహాసముద్రం' ఆగస్ట్ 19న విడుదల కానున్నది. అదితి రావ్ హైదరి, అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్లుగా నటిస్తోన్న ఈ మూవీని ఎ.కె. ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసినప్పట్నుంచీ ఇండస్ట్రీ సర్కిల్స్‌లోనూ, ప్రేక్షకుల్లోనూ అమితాసక్తి వ్యక్తమవుతూ వస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించిన ప్రతి అప్డేట్ అందరిలోనూ కుతూహలాన్ని కలిగిస్తోంది.
శనివారం మహాసముద్రం రిలీజ్ డేట్ పోస్టర్‌ను డైరెక్టర్ అజయ్ భూపతి తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా షేర్ చేశారు. ఆ పోస్టర్లో సముద్రం ఒడ్డున ఉన్న ఓ బోట్‌పై ఒకరికొకరు వీపులు చూపిస్తూ కూర్చొని సిగరెట్ తాగుతున్న ఇద్దరు హీరోలు కనిపిస్తున్నారు. ఆ పోస్టర్‌తో పాటు, "Our Sail in Theatres Begins this August 19th #MahaSamudram. Join this Voyage to witness an Epic tale of #ImmeasurableLove" అంటూ రాసుకొచ్చారు.
తొలిసారిగా ఓ అపురూపమైన ప్రేమకథను తమ బ్యానర్‌పైన అందిస్తున్నామని నిర్మాత అనిల్ సుంకర చెప్పారు. "ఇన్నేళ్లుగా మీరెందుకు ఓ లవ్ స్టోరీని నిర్మించడం లేదని ప్రతి ఒక్కరూ నన్ను అడుగుతూ వస్తున్నారు. ఇప్పుడు మేం ఎప్పటికీ గర్వపడే ఓ అపురూపమైన, అపారమైన లవ్ యాక్షనర్‌ను అందిస్తున్నాం. 19 ఆగస్ట్ 2021న తీరాలను ఢీకొట్టడానికి 'మహాసముద్రం' వస్తోంది." అని ఆయన ట్వీట్ చేశారు.
ఈ చిత్రానికి రాజ్ తోట సినిమాటోగ్రాఫర్‌గా, చైతన్ భరద్వాజ్ మ్యూజిక్ డైరెక్టర్‌గా, ప్రవీణ్ కె.ఎల్. ఎడిటర్‌గా, కొల్లా అవినాష్ ప్రొడక్షన్ డిజైనర్‌గా పని చేస్తున్నారు.
తారాగణం: శర్వానంద్, సిద్ధార్థ్, అదితి రావ్ హైదరి, అను ఇమ్మాన్యుయేల్
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com