'మహా సముద్రం' మోషన్ పోస్టర్.. వావ్ అనిపించేలా సిద్దార్థ్, శర్వా లుక్స్!
Send us your feedback to audioarticles@vaarta.com
ఆర్ఎక్స్ 100 ఫేమ్ అజయ్ భూపతి తెరకెక్కిస్తున్న లేటెస్ట్ మూవీ 'మహా సముద్రం'. సిద్దార్థ్, శర్వానంద్ నటిస్తున్న మల్టీస్టారర్ చిత్రం ఇది. అను ఇమ్మాన్యుయేల్, అదితి రావు హైదరి ఫిమేల్ లీడ్స్ గా నటిస్తున్నారు. ఎమోషనల్ లవ్ డ్రామాగా ఈ చిత్రం తెరకెక్కుతోంది.
తాజాగా ఈ చిత్ర ప్రమోషన్ కార్యక్రమాలు ప్రారంభిస్తూ చిత్ర యూనిట్ అదిరిపోయే మోషన్ పోస్టర్ విడుదల చేసింది. మోషన్ పోస్టర్ లో సిద్దార్థ్, శర్వానంద్ లుక్స్ స్టన్నింగ్ గా ఉన్నాయి. చైతన్ భరద్వాజ్ అందించిన బ్యాగ్రౌండ్ సంగీతం అయితే నెక్స్ట్ లెవల్.
ఇప్పటికే చిత్రంలో కీలక పాత్రలని రివీల్ చేస్తూ విడుదల చేసిన ఫస్ట్ లుక్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు అసలైన ప్రచార కార్యక్రమాలని ప్రారంభించబోతున్నారు. మోషన్ పోస్టర్ లో సిద్దార్థ్ గన్ పట్టుకుని ఉన్న ఫోజు, శర్వానంద్ ఉగ్ర రూపంతో నడుచుకుని వస్తున్న స్టైల్ సినిమాపై అంచనాలు పెంచేస్తున్నాయి.
ఈ చిత్రంలో జగపతి బాబు, రావు రమేష్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. చైతన్ భరద్వాజ్ అందించిన బ్యాగ్రౌడ్ స్కోర్ వింటుంటేనే ఈ చిత్రంలో యాక్షన్ సీన్స్ ఏవిధంగా ఉండబోతున్నాయో అర్థం అవుతున్నాయి. సుంకర రామబ్రహ్మం ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పూర్తి కాగానే ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments