ఆ మ్యాజిక్ మరోసారి రిపీట్ అవుతుందా?
Send us your feedback to audioarticles@vaarta.com
క్రియేటివ్ కమర్షియల్స్.. ఎన్నో విజయవంతమైన సినిమాలను తెలుగు ప్రేక్షకులకు అందించిన నిర్మాణ సంస్థ పేరిది. ఈ సంస్థ అధినేత కె.ఎస్.రామారావు ప్రస్తుతం తేజ్ ఐ లవ్ యు అనే సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సంస్థలో నిర్మితమవుతున్న 45వ చిత్రమిది. ఎ.కరుణాకరన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో సాయిధరమ్ తేజ్, అనుపమ పరమేశ్వరన్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు . ఫీల్ గుడ్ లవ్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ సినిమాకి గోపీసుందర్ సంగీతమందిస్తున్నారు
ఆసక్తికరమైన విషయమేమిటంటే.. మూడేళ్ళ క్రితం ఇదే సంస్థ నుంచి వచ్చిన ఫీల్ గుడ్ లవ్ ఎంటర్‌టైనర్ మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజుకి కూడా గోపీసుందర్ సంగీతమందించారు. ఆ సినిమాకి ఆయన అందించిన పాటలు, నేపథ్య సంగీతం సినిమాకి ప్లస్‌గా నిలిచాయి. ఈ నేపథ్యంలో క్రియేటివ్ కమర్షియల్స్, గోపీసుందర్ కాంబినేషన్‌లో రెండోసారి వస్తున్న ఈ సినిమా కూడా ఆ మ్యాజిక్ రిపీట్ చేస్తుందేమో చూడాలి. కాగా.. జూన్ 14న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com