విశాల్‌కు మద్రాస్ హైకోర్ట్ షాక్
Send us your feedback to audioarticles@vaarta.com
హీరో, నిర్మాత విశాల్‌కు మద్రాస్ హైకోర్ట్ శుక్రవారం పెద్ద షాకే ఇచ్చింది. వివరాల్లోకెళ్తే... విశాల్, సుందర్.సి కాంబినేషన్‌లో రూపొందిన చిత్రం 'యాక్షన్'.ఈ సినిమా విడుదల సమయంలో నిర్మాతలకు రూ8.29 కోట్ల మేరకు నష్టం వాటిల్లింది. ఆ సమయంలో నిర్మాణ సంస్థ ట్రైడెంట్ ఆర్ట్స్‌కు మరో సినిమా చేస్తానని చెప్పిన విశాల్ సినిమా చేయలేదు. దాంతో సదరు సంస్థ కోర్టులో కేసు వేసింది. తమకు విశాల్ ఇవ్వాల్సిన రూ.8.29కోట్ల రూపాయలు చెల్లించాలని నిర్మాతలు కోరారు. కేసును పరిశీలించిన మ్రదాస్ హైకోర్టు యాక్షన్ సినిమా నష్టాలను విశాల్ భరించాల్సిందేనని తీర్పునిచ్చింది.
యాక్షన్ విడుదల సమయంలో సినిమా రూ.20 కోట్లు కలెక్ట్ చేస్తుందనే అగ్రిమెంట్‌పై విశాల్ సంతకం చేశారు. సినిమాకు రూ.44 కోట్ల బడ్జెట్ అయ్యింది. తీరా సినిమా విడుదలయ్యాక తమిళనాడులో 7.7కోట్ల రూపాయలు, తెలుగు రాష్ట్రాల్లో రూ.4కోట్ల వసూళ్లను సాధించింది. దీంతో విశాల్ నష్టాలను భర్తీ చేయడానికి తన తదుపరి చిత్రాన్ని ట్రైడెంట్ ఆర్ట్స్ బ్యానర్‌లో ఆనంద్ దర్శకత్వంలో చేస్తానని మాటిచ్చారు. సినిమా చేయలేదు సరికదా.. చేసిన చక్ర సినిమాను ఓటీటీలో విడుదల చేయడానికి రెడీ అయ్యారు. దీనిపై ట్రైడెంట్ ఆర్ట్స్ సంస్థ తమకు విశాల్ ఇవ్వాల్సిన రూ.8.29 కోట్లు చెల్లించే వరకు 'చక్ర' సినిమా విడుదలను ఆపాలంటూ కేసు వేసింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments