జయలలిత బయోపిక్స్‌కి తొలగిన అడ్డంకులు
- IndiaGlitz, [Saturday,December 14 2019]
తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి, విప్లవ నాయకురాలు జయలలిత జీవితాన్ని ఆధారంగా చేసుకుని రెండు సినిమాలు, ఒక వెబ్ సిరీస్ తెరకెక్కుతోంది. అయితే వీటికి జయలలిత మేనకోడలు దీపా జయకుమార్ రూపంలో అడ్డంకులు ఏర్పడ్డాయి. జయలలిత జీవితాన్ని తప్పుగా చూపిస్తున్నారని సదరు బయోపిక్ దర్శక నిర్మాతలపై దీప మద్రాస్ హైకోర్టులో కేసు వేసింది. అయితే కేసును పరిశీలించిన ధర్మాసనం పిటిషన్‌ను తోసిపుచ్చింది. అయితే ఈ బయోపిక్స్‌లో దీప పాత్ర ఉండకూడదని బయోపిక్ దర్శక నిర్మాతలకు కోర్టు సూచించింది. ఇప్పుడు జయలలిత బయోపిక్ రూపొందిస్తోన్న దర్శక నిర్మాతలకు టెన్షన్ నుండి రిలీఫ్ దొరికినట్లయ్యింది. అయితే హైకోర్టులో కేసు ఓడిపోయిన దీప సుప్రీమ్ కోర్టును ఆశ్రయించే అవకాశాలున్నాయని చెన్నై వర్గాలు అంటున్నాయి.
జయలలితపై ఇప్పుడు ఎ.ఎల్.విజయ్ దర్శకత్వంలో తలైవి అనే బయోపిక్ రూపొందుతోంది. ఇందులో కంగనారనౌత్ టైటిల్ పాత్రలో నటిస్తుంది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో సినిమాను రూపొందిస్తున్నారు. అలాగే ప్రియదర్శిని దర్శకత్వంలో నిత్యామీనన్ పాత్రధారిగా ది ఐరన్ లేడీ అనే సినిమాను రూపొందుతుంది. ఇవి కాకుండా గౌతమ్ మీనన్ దర్శకత్వంలో క్వీన్ అనే వెబ్ సిరీస్‌ను రూపొందింది. దీనిలో రమ్యకృష్ణ నటించారు.