తలైవాపై మద్రాస్ హైకోర్టు ఆగ్రహం
Send us your feedback to audioarticles@vaarta.com
సూపర్‌స్టార్ రజినీకాంత్‌పై చెన్నై కోర్టు ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. ఇంతకూ కోర్టుకి కోపం వచ్చేలా రజినీకాంత్ ఏం చేశారు? అనే వివరాల్లోకెళ్తే.. రజినీకాంత్‌కు చెన్నైలో ఓ కల్యాణ మండపం ఉన్న సంగతి తెలిసిందే. ఈ మండపానికి పన్నుగా తమిళనాడు ప్రభుత్వం రూ. 6.5 లక్షలను కట్టాలంటూ కోరింది. అయితే దీనిపై రజినీకాంత్ కోర్టుకెక్కారు. మార్చి నుండి కోవిడ్ మొదలైనప్పుడు కల్యాణ మండపాన్ని మూసివేశామని, దానిపై ఎలాంటి ఆదాయం లేదని ఈ నేపథ్యంలో తమకు ట్యాక్స్ విధించడం సరికాదంటూ రజినీకాంత్ లాయర్ కోర్టుకు విన్నవించారు. అయితే ప్రభుత్వం విధించిన ట్యాక్స్‌ను విధిగా కట్టాలని, అలా కట్టకుండా ప్రభుత్వంపై కోర్టులో కేసు వేయడం చట్టరీత్యా నేరమని మద్రాస్ హైకోర్టు తెలియజేసింది. అంతే కాకుండా ఇలా కోర్టుకెక్కితే జరిమానా కూడా కట్టాల్సి ఉంటుందని పేర్కొన్నారు జస్టిస్. దీంతో తమకు కేసును వెనక్కి తీసుకోవడానికి కాస్త సమయం కావాలంటూ రజినీకాంత్ తరపు లాయర్ కోర్టును కాస్త గడువు అడిగారు.
ఇక సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం తలైవా రజినీకాంత్ టైటిల్ పాత్రలో శివ దర్శకత్వంలో ‘అణ్ణాత్తే’ సినిమా రూపొందుతోంది. కోవిడ్ ప్రభావంతో ఆగిన ఈ సినిమా షూటింగ్ త్వరలోనే రీస్టార్ట్ కానుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout