త‌లైవాపై మ‌ద్రాస్ హైకోర్టు ఆగ్ర‌హం

సూప‌ర్‌స్టార్ ర‌జినీకాంత్‌పై చెన్నై కోర్టు ఆగ్ర‌హాన్ని వ్య‌క్తం చేసింది. ఇంత‌కూ కోర్టుకి కోపం వ‌చ్చేలా రజినీకాంత్ ఏం చేశారు? అనే వివ‌రాల్లోకెళ్తే.. ర‌జినీకాంత్‌కు చెన్నైలో ఓ క‌ల్యాణ మండ‌పం ఉన్న సంగ‌తి తెలిసిందే. ఈ మండ‌పానికి ప‌న్నుగా త‌మిళ‌నాడు ప్ర‌భుత్వం రూ. 6.5 ల‌క్ష‌ల‌ను క‌ట్టాలంటూ కోరింది. అయితే దీనిపై ర‌జినీకాంత్ కోర్టుకెక్కారు. మార్చి నుండి కోవిడ్ మొద‌లైన‌ప్పుడు క‌ల్యాణ మండ‌పాన్ని మూసివేశామ‌ని, దానిపై ఎలాంటి ఆదాయం లేద‌ని ఈ నేప‌థ్యంలో త‌మ‌కు ట్యాక్స్ విధించ‌డం సరికాదంటూ ర‌జినీకాంత్ లాయ‌ర్ కోర్టుకు విన్న‌వించారు. అయితే ప్ర‌భుత్వం విధించిన ట్యాక్స్‌ను విధిగా క‌ట్టాల‌ని, అలా క‌ట్ట‌కుండా ప్రభుత్వంపై కోర్టులో కేసు వేయడం చ‌ట్ట‌రీత్యా నేర‌మ‌ని మ‌ద్రాస్ హైకోర్టు తెలియ‌జేసింది. అంతే కాకుండా ఇలా కోర్టుకెక్కితే జ‌రిమానా కూడా క‌ట్టాల్సి ఉంటుంద‌ని పేర్కొన్నారు జ‌స్టిస్. దీంతో త‌మ‌కు కేసును వెన‌క్కి తీసుకోవడానికి కాస్త స‌మ‌యం కావాలంటూ ర‌జినీకాంత్ త‌ర‌పు లాయ‌ర్ కోర్టును కాస్త గ‌డువు అడిగారు.

ఇక సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం తలైవా రజినీకాంత్ టైటిల్ పాత్రలో శివ దర్శకత్వంలో ‘అణ్ణాత్తే’ సినిమా రూపొందుతోంది. కోవిడ్ ప్రభావంతో ఆగిన ఈ సినిమా షూటింగ్ త్వరలోనే రీస్టార్ట్ కానుంది.

More News

ఆమె ప్రసవం.. ప్రపంచ వ్యాప్తంగా సంచలనం..

ఒక మహిళ ప్రసవం ప్రపంచ వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఓ అనూహ్య పరిస్థితుల్లో కొన్ని వేల అడుగుల ఎత్తులో జరగడమే ఇందుకు కారణం.

ప్ర‌భాస్ చిత్రంతో అమితాబ్ రెమ్యున‌రేష‌న్ ఎంతో తెలుసా..?

ప్యాన్‌ ఇండియా స్టార్‌ పభాస్‌ 21వ సినిమా ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్‌ బ్యానర్‌పై అశ్వినీదత్‌ నిర్మాతగా 'మహానటి' ఫేమ్‌ నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో

నితిన్ గ్యాప్ తీసుకోవ‌డం లేదా..?

కోవిడ్ టైమ్‌లో కొత్త పెళ్లికొడుకుగా మారిన నితిన్ ప్ర‌స్తుతం ‘రంగ్ దే’ సినిమాను పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నాడు.

హైదరాబాద్ అస్తవ్యస్తం.. 100 ఏళ్లలో ఇదే తొలిసారి..

భారీ వర్షాలతో హైదరాబాద్ అస్తవ్యస్తమైంది. భారీ వృక్షాలు సైతం నేలకొరగాయి. విద్యుత్, టెలిఫోన్, ఇంటర్నెట్ సేవలకు అంతరాయం ఏర్పడింది.

త‌మిళ ద‌ర్శ‌కుడితో చ‌ర‌ణ్‌..!

మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ ప్ర‌స్తుతం రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ హీరోగా ‘ఆర్ఆర్ఆర్ (రౌద్రం ర‌ణం రుధిరం‌)’లో