దీపావళి నాడు స్పెషల్ సర్‌ప్రైజ్.. ముగ్గురు హీరోయిన్ల గుట్టు విప్పిన నాని

  • IndiaGlitz, [Thursday,November 04 2021]

నేచురల్ స్టార్ నాని హీరోగా రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘‘ శ్యామ్ సింగ రాయ్ ’’ సినిమా మీద టాలీవుడ్‌లో మంచి అంచనాలే ఉన్నాయి. ఇప్పటి వరకు విడుదల చేసిన పోస్టర్లు, టీజర్, సాంగ్ ప్రోమో ఇలా ప్రతీది ఆకట్టుకుంటోంది. నిహారిక ఎంటర్టైన్మెంట్స్‌ బ్యానర్‌పై వెంకట్ బోయనపల్లి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్యామ్ సింగ రాయ్‌కి సంబంధించి దీపావళి సందర్భంగా ఓ పోస్టర్‌ను విడుదల చేసింది చిత్ర యూనిట్. ఈ పోస్టర్‌తో పాటు సినిమాలోని స్టోరీపై లైట్‌గా లీకులిచ్చాడు నాని.

ఈ చిత్రంలో సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్‌లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటి వరకు సాయి పల్లవి, కృతి శెట్టిలకు సంబంధించిన పోస్టర్లను విడుదల చేశారు. ఈ దీపావళి సందర్భంగా మూడో హీరోయిన్ మడోన్నా పాత్రకు సంబంధించిన లుక్‌ను రివీల్ చేశారు. దీంతో పాటు సాయి పల్లవి, కృతి శెట్టి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లను కూడా విడుదల చేశారు. ఆ తర్వాత నాని ఓ పోస్ట్ కూడా చేశాడు. దాంట్లో ముగ్గురు కథానాయికల గురించి చెప్పేశాడు

మెమోరీ కృతి శెట్టి, టైం సాయి పల్లవి, ట్రూత్ మడోన్నా సెబాస్టియన్ అని కామెంట్ చేశాడు. అంటే ఈ ముగ్గురు హీరోయిన్‌లలో ఒకరు ఫ్లాష్ బ్యాక్, ప్రజెంట్ అని తెలుస్తోంది. పునర్జన్మల చుట్టూ తిరిగే కథాంశంగా ‘శ్యామ్ సింగ రాయ్’’ తెరకెక్కుతున్నట్లు ఇండస్ట్రీ టాక్. ఈ చిత్రానికి సత్యదేవ్ జంగా కథను అందించారు. జాన్ వర్గీస్ కెమెరామెన్‌గా పని చేస్తున్నారు. నవీన్ నూలి ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. క్రిస్మస్ కానుకగా.. తెలుగు, తమిళ, కన్నడ , మళయాల భాషల్లో డిసెంబర్ 24న ‘‘ శ్యామ్ సింగ రాయ్’’ని విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ఇప్పటికే అనౌన్స్ చేశారు.