మధులత నిర్మాణ సారధ్యంలో 'నీ ఊహల్లో నే ఉంటా'

  • IndiaGlitz, [Saturday,July 14 2018]

దర్శకత్వ శాఖలో సుదీర్ఘమైన అనుభవం కలిగిన ప్రతిభాశాలి పురందర్ దాస్.కె స్వీయ దర్శకత్వంలో.. కె.పి.ఆర్ క్రియేషన్స్ పతాకంపై.. మధులత నిర్మాణ సారధ్యంలో రూపొందించిన యాక్షన్ ఓరియంటెడ్ ప్రేమకథాచిత్రం 'నీ ఊహల్లో నే ఉంటా'.

మనోజ్ కోడూరు, పర్లి భారతి జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో గోపాల్ పావగాడ, సంధ్య, శ్రావణి, ఆది మామిళ్ళ, హిందూనాథ్, మంజునాధ్ ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. సెన్సార్ సహా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ నవ్య ప్రేమకథాచిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

దర్శకనిర్మాత పురంధర్ దాస్.కె మాట్లాడుతూ.. 'తన మిత్రులకు జరిగిన అన్యాయాన్ని ఓ యువకుడు ఏ విధంగా పోరాటం చేసాడన్నది క్లుప్తంగా చిత్ర కథాంశం. యాక్షన్ తోపాటు వినోదానికి పెద్ద పీట వేస్తూ పగ నేపథ్యంలో రూపొందిన చక్కని ప్రేమ కథ 'నీ ఊహాల్లో నే ఉంటా'. దాదాపుగా అంతా కొత్త తారాగణంతో రూపొందిన ఈ చిత్రం మంచి విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది' అన్నారు.

ఈ చిత్రానికి డాన్స్: వన్నూర్ కుమార్, ఛాయాగ్రహణం: ఎస్.కె.ఎం షరీఫ్, సంగీతం: రాజ్ కిరణ్, ఆర్.ఆర్: సి.ఎన్ ఆదిత్య, ఎడిటర్: ఎస్.జె.శివకిరణ్, నిర్మాణ సారధ్యం: మధులత, కథ-మాటలు-పాటలు-నిర్మాత-దర్శకత్వం: పురందర్ దాస్.కె!!

More News

'ప్రేమకు రెయిన్ చెక్' టైటిల్ లాంచ్

ప్రముఖ నిర్మాణ సంస్థ నార్త్ స్టార్ ఎంటర్ టైన్మెంట్స్ సమర్పణలో స్టోన్ మీడియా ఫిలిమ్స్ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రం "ప్రేమ రెయిన్ చెక్".

'అంతర్వేదం' బృందం కష్టానికి తప్పకుండా తగిన ఫలితం దక్కుతుంది - తనికెళ్లభరణి

ఫ్రెండ్స్ ఫండింగ్ ఫిలిమ్స్ బ్యానర్ పై క్రౌడ్ ఫండ్ తో నిర్మించిన చిత్రం "అంతేర్వేదమ్" .చందిన రవికిషోర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకొని

అల‌నాటి గాయ‌ని రాణి క‌న్నుమూత‌

అక్కినేని నాగేశ్వ‌ర‌రావు న‌టించిన 'దేవ‌దాసు' సినిమాలో అంతా భ్రాంతియేనా... అనే పాట చాలా ఫేమ‌స్‌. ఈ పాట‌ను పాడిన గాయ‌ని రాణి. ఈమె హైద‌రాబాద్ క‌ల్యాణ్‌న‌గ‌ర్‌లో క‌న్నుమూశారు.

ఝాన్సీ గా వస్తున్న జ్యోతిక

స‌న్సేష‌న‌ల్ డైరెక్ట‌ర్ బాల సొంత ద‌ర్శ‌క‌,నిర్మాణంలో తెర‌కెక్కించిన  మూవీ నాచియార్. ఈ చిత్రాన్ని తెలుగు లో డి వెంకటేష్ డి వి సినీ క్రియేషన్స్ బ్యానర్ పై విడుదల కానుంది.

సీనియర్‌ నటుడు వినోద్‌ కన్నుమూత

300కు పైగా చిత్రాల్లో నటించి మెప్పించిన క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ వినోద్(59) శ‌నివారం తెల్ల‌వారు జామున 2 గంట‌ల‌కు బ్రెయిన్ స్ట్రోక్‌తో క‌న్నుమూశారు.