ఏపీలో ఏ పార్టీ గెలుస్తుందని మాధవిలతను అడగ్గా..!

  • IndiaGlitz, [Sunday,May 12 2019]

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో మేం గెలుస్తామని వైసీపీ.. కాదు కాదు మళ్లీ మేమే గెలవబోతున్నామని టీడీపీ చెబుతున్నప్పటికీ సీఎం పీఠం ఎవరిదో.. ప్రతిపక్షంలో కూర్చోవాల్సిందెవరో..? మే-23న తేలిపోనుంది. అయితే.. అధికారంలోకి రాబోయేది మా పార్టీనే అంటూ అటు టీడీపీ.. ఇటు వైసీపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి, సినీ నటి మాధవి.. ఏపీలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందనే ప్రశ్నకు చాలా తెలివిగా ఆమె సమాధానమిచ్చారు. ఏపీలో ఏ పార్టీ గెలుస్తుందో ఎవరూ చెప్పలేక పోతున్నారని చెప్పుకొచ్చారు. 2014లో జరిగిన ఎన్నికల్లో ఏ పార్టీ విజయం సాధిస్తుందన్న విషయాన్ని ప్రజలు గానీ, విశ్లేషకులు గానీ చెప్పగలిగారని, ఈసారి మాత్రం చెప్పలేకపోతున్నారన్నారు.

ఏపీలో గెలిచేది ఎవరంటే..!

‘అభివృద్ధికి పట్టం కడతారా?’ ‘ఒక్కసారి ఛాన్స్ ఇవ్వండి’ అన్న వాళ్లకు పట్టం కడతారా?’ అనే ప్రశ్నకు .. ‘నేను విన్నది ఏంటంటే.. ఒక్కసారి ఛాన్స్ ఇస్తే అభివృద్ధికి పట్టం కడతారేమో.. ఎందుకంటే, ఉన్నవాళ్లు పట్టం కట్టలేకపోతున్నారు కాబట్టి ఇంకొకరికైనా ఇస్తే బాగుంటుంది’ అని పరోక్షంగా వైసీపీనే అని మాధవి చెప్పుకొచ్చారు. ఎంత అభివృద్ధి జరిగిందన్నదే ప్రజలు చూస్తారు కనుక, రాజకీయాల్లో ఎంత సీనియారిటీ ఉన్నా పట్టించుకోరని చంద్రబాబును ఉద్దేశించి ఇన్‌డైరెక్టుగా ఆమె వ్యాఖ్యలు చేశారు.కాగా.. ఒకే ఒక్క ఛాన్స్ ఇవ్వండి.. నేనేంటో చూపిస్తాను.. అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తానని వైసీపీ అధినేత వైఎస్ జగన్.. వైఎస్ విజయమ్మ, షర్మిళ, భారతి ఎన్నికల ప్రచారంలో పదేపదే చెప్పిన విషయం అందరికీ గుర్గుండే ఉంటుంది.

మన పరువు మనమే తీసుకుంటున్నాం..!

అంతటితో ఆగని ఆమె.. ఏపీలో ఏ పార్టీ గెలవబోతోందో అక్కడి ప్రజలకు తెలుసు. ఏపీలో ఏ పార్టీ హవా వీస్తోందో, ఏ పార్టీపై విశ్వాసం ఉందో నా నోటితో చెప్పను.. ప్రజలకు బాగా తెలుసు. ఒక్కోసారి కొన్ని ఈక్వేషన్స్ మారుతుంటాయి. ఈ ఎన్నికల్లో కులం, డబ్బు ప్రభావం ఉండటం బాగా గమనించాను. ఎప్పుడైతే, కులం, డబ్బుకు లొంగిపోకుండా ఉంటామో అప్పుడే నిజమైన నాయకుడిని ఎన్నుకోగలం. తెలుగు వాళ్లు డబ్బుల కోసం ఓట్లు వేస్తారని దేశ, విదేశాల్లో చెప్పుకుంటున్నారు.. మన పరువు మనమే తీసుకునే స్థాయికి దిగజారుతున్నాం. గుంటూరులో అయితే కుల, డబ్బు రాజకీయాలు చాలా ఎక్కువ. ఇంకా, నిజాయతీ గల నాయకులు ఎక్కడి నుంచి వస్తారు. ప్రజలు ఈసారైనా సరైన నిర్ణయం తీసుకుని ఉంటే.. వారు ఎటు వైపు మొగ్గు చూపారో వాళ్లే సీఎం అవుతారు అని మాధవీ లత చెప్పుకొచ్చారు. సో.. మొత్తానికి చూస్తే ఇన్‌డైరెక్టుగా తన మనసులోని మాటను మాధవి చెప్పేశారన్న మాట.

More News

పవన్‌ కోసం ‘మహర్షి’ స్పెషల్ షో.. ఈ పుకార్లు నిజమేనా!?

సూపర్‌స్టార్ మహేశ్ బాబు, పూజా హెగ్దే నటీనటులుగా వంశీ పైడిపల్లి తెరకెక్కించిన చిత్రం ‘మహర్షి’.

ప్ర‌ముఖ నిర్మాత వెంక‌ట రామిరెడ్డి క‌న్నుమూత‌

ప్ర‌ముఖ నిర్మాత వెంక‌ట‌రామిరెడ్డి అనారోగ్యంతో చెన్నైలో క‌న్నుమూశారు. ఈయ‌న భార్య, కుమారుడు, ఇద్ద‌రు కుమార్తెలు ఉన్నారు.

ఏపీలో మార్పు మొద‌లైంది.. అది అసెంబ్లీలో క‌న‌బ‌డుతుంది!

‘సార్వత్రిక ఎన్నికలతో ఏపీలో మార్పు మొద‌లైంది... అది అసెంబ్లీలో క‌న‌బ‌డుతుంది.. ఎంత ఏంటి అనే సంగ‌తి ప‌క్కన‌పెడితే జ‌న‌సేన పార్టీ బ‌లాన్ని త‌క్కువ‌గా అంచ‌నా వేయొద్దు’

గాజువాకలో గెలుపెవరిదో తేల్చేసిన పృథ్వీ..

ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎప్పుడెప్పుడు వస్తాయా..? అని అధినేతలు వేచి చూస్తున్నారు.

పాటల మినహా పూర్తయిన 'అమ్మ దీవెన'

అమ్మతోనే పుట్టుక ప్రారంభం, అమ్మనే సృష్టికి మూలం,అమ్మ లేని లోకం చీకటిమయం అవుతుందంటూ మాతృమూర్తి పై