మాధవన్‌కు పుత్రోత్సాహం.. సిల్వర్ మెడల్ కొట్టిన వేదాంత్
- IndiaGlitz, [Thursday,September 26 2019]
ప్రముఖ దక్షిణాది నటుడు మాధవన్ కుమారుడు వేదాంత్ అంతర్జాతీయంగా తన సత్తా చాటాడు. అంతర్జాతీయ స్విమ్మింగ్ పోటీల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న వేదాంత్ సిల్వర్ మెడల్ (రజత పతకం) దక్కించుకున్నాడు. థాయ్ లాండ్‌లో జరుగుతున్న ఏషియన్ ఏజ్ గ్రూప్ స్విమ్మింగ్ పోటీల్లో 4×100మీ విభాగంలో వేదాంత్ రెండో స్థానంలో నిలిచాడు. ఇదిలా ఉంటే.. గతంలో ఇదే థాయ్‌లాండ్ వేదికగా జరిగిన 1500 మీటర్ల ఫ్రీస్టైల్ స్విమ్మంగ్‌లోనూ వేదాంత్ కాంస్య పతకాన్ని సాధించాడు. దీంతో.. మాధవన్ పుత్రోత్సాహంతో పొంగిపోతున్నారు.
సత్తా చాటిన వేదాంత్!
అయితే కేవలం 14 ఏళ్ల వయస్సులోనే వేదాంత్ అంతర్జాతీయంగా సత్తా చాటుతుండటం గర్వించదగ్గ విషయని చెప్పుకోవచ్చు. కాగా.. బాల్యం నుంచే స్విమ్మింగ్‌పై ఆసక్తితో వేదాంత్.. అనేక పోటీల్లో పాల్గొని భారత స్విమ్మింగ్ జట్టుకు ఎంపికయ్యాడు. ఇప్పటికే జాతీయ స్థాయిలో జరిగిన జూనియర్ స్విమ్మింగ్ పోటీల్లో 3 స్వర్ణ పతకాలు, 1 రజత పతకం సాధించిన సంగతి తెలిసిందే. ఇది వ్యక్తిగతంగా అతనికి మొదటి మెడల్స్ కావడం మరో విశేషం..
గర్వంగా ఉంది..!
‘ఆసియా క్రీడల్లో భారతదేశానికి రజత పతకం లభించింది. అంతా దేవుని దయ. భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్న వేదాంత్ మొట్టమొదటి పతకం’ అని చెబుతూ.. ఆసియా ఏజ్ గ్రూప్ స్విమ్మింగ్ ఛాంపియన్‌షిప్ నుంచి ఫోటోలను పోస్ట్ చేశాడు. ఈ ఫొటోల్లో వేదాంత్, అతని సహచరులను చూడొచ్చు. మరో పోస్టులో.. ‘ఈ రోజు థాయ్‌లాండ్‌లో జరిగిన అంతర్జాతీయ ఆసియా క్రీడల్లో.. వేదాంత్ భారతదేశానికి తొలి పతకం సాధించినందున సరిత, నేను గర్వంగా ఉన్నాం. మీ ఆశీర్వాదాలన్నిటికీ ధన్యవాదాలు’ అని తన ఇన్‌స్టాగ్రామ్‌లో మాధవన్ రాసుకొచ్చారు.
R Madhavan son:R Madhavan’s Son Vedaant Wins Silver For India At Swimming Championship & He's One Proud Dad?????????? https://t.co/BQ2flkZMqB
— Ranganathan Madhavan (@ActorMadhavan) September 26, 2019