నెటిజన్ కౌంటర్కి మాధవన్ రిప్లై
Send us your feedback to audioarticles@vaarta.com
తమిళ నటుడైన మాధవన్ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితుడే. ఈయన నటించిన తమిళ చిత్రాలు సఖి, చెలి, యువ చిత్రాలు తెలుగులోనూ మంచి విజయాలను సాధించాయి. తెలుగులో ఈయన సవ్యసాచిలో నెగెటివ్ పాత్రలో నటించారు. తాజాగా అనుష్కతో కలిసి `నిశ్శబ్ధం`లో నటిస్తున్నారు. ఈ ఏడాది చివరల్లో ఈ చిత్రం విడుదల కానుంది. రీసెంట్గా రాఖీపౌర్ణమిని పురస్కరించుకుని తన కొడుకు, తండ్రితో కలిసి ఉన్న ఫొటోను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు మాధవన్. దీనిపై పలువురు తమ స్పందనను తెలియజేశారు.
అయితే ఓ నెటిజన్ స్పందిస్తూ... ``జీసస్ శిలువలు, ఫొటోలు పూజా మందిరాల్లో ఉంటాయా? ఇదంతా సెట్ అప్.. దీని కారణంగా మీపై ఉన్న గౌరవం పోయింది`` అంటూ స్పందించాడు. దానికి మాధవన్ రిప్లై ఇస్తూ..``సంకుచిత భావాలున్న నీలాంటి వ్యక్తుల రెస్పెక్ట్ నాకు అవసరం లేదు. నేను అన్ని మతాలను గౌరవిస్తాను. గుళ్లకే కాదు చర్చికి, మసీదుకి కూడా వెళతాను`` అన్నారు. మాధవన్ రిప్లై ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout