త‌మ‌న్నా కోసం ఎన్నో మార్పులు?

  • IndiaGlitz, [Friday,October 23 2015]

'బాహుబ‌లి' త‌రువాత త‌మ‌న్నా రేంజ్ పెరిగిపోయింద‌న్న‌ది వాస్త‌వం. ఆ సినిమా కోసం అవంతిక పాత్ర‌లో అందం, అభిన‌యం ప్ర‌ద‌ర్శించి మంచి మార్కులు కొట్టేసింది త‌మ‌న్నా. ఈ నేప‌థ్యంలో త‌మ‌న్నా త‌దుప‌రి చిత్రాల‌పై అంద‌రి ఫోక‌స్ ప‌డుతోంది. ఆ కొత్త చిత్రాల‌లో 'ఊపిరి' ఒక‌టి. నాగార్జున‌, కార్తి కాంబినేష‌న్‌లో మ‌ల్టీస్టార‌ర్ చిత్రంగా తెర‌కెక్కుతున్న ఈ సినిమా త‌మిళంలోనూ 'తోళా' గా రిలీజ్ కానుంది. ఫ్రెంచ్ మూవీ 'ది ఇన్‌ట‌చ‌బుల్స్‌'కి రీమేక్ అయిన ఈ 'ఊపిరి' కోసం ఎన్నో మార్పులు చేశార‌ని ఇన్‌సైడ్ సోర్స్ చెప్పుకొస్తోంది.

అందులో ఒక‌టి ఏమిటంటే.. మ‌ల్టీ బిలియ‌నీర్ అయిన నాగార్జున‌కి సెక్ర‌ట‌రీ అయిన త‌మ‌న్నా పాత్ర నిడివిని ఎంతో పెంచార‌ట‌. ఒరిజ‌న‌ల్‌లో ఈమె పాత్ర ప‌రిమిత స‌న్నివేశాల‌కే ప‌రిమిత‌మైతే.. దాన్ని కాస్త కార్తీతో ల‌వ్, డ్యూయెట్‌, గ్లామ‌ర్‌.. ఇలా కొన్నిఅంశాల‌ను జోడిస్తూ పెంచేశార‌ట‌. దీంతో.. సినిమాలో మ‌రిన్ని క‌మ‌ర్షియ‌ల్ ఎలిమెంట్స్ పెరిగిన‌ట్ల‌యింద‌ని ఇన్‌సైడ్ సోర్స్ చెబుతోంది. ఫీల్‌గుడ్ ఎంట‌ర్‌టైన‌ర్ అయిన 'ఊపిరి' వ‌చ్చే ఏడాది ఆరంభంలో విడుద‌ల కానుంది.