మదనపల్లె ఘటన: సోషల్ మీడియా ఖాతాల సెట్టింగ్స్ ఎవరు మార్చారు?
Send us your feedback to audioarticles@vaarta.com
తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టించిన మదనపల్లె జంట హత్యల కేసులో రోజురోజుకూ మిస్టరీగా మారుతోంది. పూర్తి వివరాలు చెప్పే స్థితిలో నిందితులు లేకపోవడం కూడా అసలు ఆ రోజు ఏం జరిగిందనే విషయంలో క్లారిటీ రావడం లేదు. జంట హత్యలు జరిగి వారం గడుస్తున్నా ఇంకా ఈ కేసు మిస్టరీగానే ఉంది. ఈ హత్యోదంతంపై సోషల్ మీడియా సైతం రకరకాల కథనాలు వెలువడుతున్నాయి. కాగా.. పోలీసులు ఈ కేసు విచారణను మరింత వేగవంతం చేశారు. ప్రస్తుతం నిందితులతో పాటు హత్యకు గురైన యువతుల సోషల్ మీడియా ఖాతాలను పోలీసులు విశ్లేషిస్తున్నారు. అయితే వారి సోషల్ మీడియా ఖాతాలను పరిశీలించిన పోలీసులకు షాకింగ్ విషయాలు తెలిసినట్టు సమాచారం.
సెట్టింగ్స్ మార్చారనే అనుమానాలు..
పెద్దమ్మాయి అలేఖ్యకు అంత మూఢభక్తి లేదని ఆమె స్నేహితులు సోషల్ మీడియాలో చర్చకు తెరలేపారు. ఇదిలా ఉండగా.. అలేఖ్య సోషల్ మీడియా ఖాతా ప్రొఫైల్ నేమ్, సెట్టింగ్స్‌ను ఎవరో మార్చారంటూ కొత్త అనుమానాలు మొదలయ్యాయి. చిన్నమ్మాయి సాయి దివ్య ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌ను సైతం అలేఖ్య మార్చిందనే వాదన సైతం వినిపిస్తోంది. అలేఖ్య ఫేస్‌బుక్ ఖాతాలు మరో మతాన్ని విమర్శిస్తూ వ్యాఖ్యలు కల్పించడంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అలేఖ్య ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ కూడా ప్రైవేట్ నుంచి పబ్లిక్‌కు మారడం అది కూడా హత్యకు కొన్ని రోజులు ముందు జరగడం అనుమానాస్పదంగా మారింది.
నాలుక కోసి తినడం కూడా నిజమే..
ఇన్ని అనుమానాల మధ్య ఒక విషయంలో మాత్రం క్లారిటి వచ్చినట్టు తెలుస్తోంది. తల్లి పద్మజ.. పెద్ద కూతురు అలేఖ్యని హత్య చేసిన అనంతరం ఆమె నాలుక కోసి తాను కాళికాదేవినంటూ తినేయడం కూడా సంచలనంగా మారింది. విషయం తెలుసుకున్న తెలుగు రాష్ట్రాలు షాక్ అయ్యాయి. అయితే దీనిపై పోస్టుమార్టం నివేదిక వస్తే కానీ క్లారిటీ రాదని నిన్నటి వరకూ భావించారు. అయితే పోస్టుమార్టంలో వైద్యులు.. అలేఖ్య నాలుక కొనభాగం కాసింత దెబ్బతిన్నట్లు గుర్తించినట్టు సమాచారం. దీంతో పద్మజ కూతురు నాలుకను కోసి తినేసిందన్న వాదనకు బలం చేకూరినట్టైంది. ఇక ఈ కేసులో ఇంకెన్ని సంచలన విషయాలు వెలుగు చూస్తాయో తెలియాల్సి ఉంది.
ప్రశాంతంగానే నిందితులు..
కాగా.. నిన్న మొన్నటి వరకూ అరుపులు, కేకలతో జైలు సిబ్బందిని బెంబేలెత్తించిన పద్మజ, ఆమె భర్త ప్రస్తుతం ప్రశాంతంగానే ఉన్నట్టు తెలుస్తోంది. తోటి ఖైదీలతో కలిసిపోయి సాధారణ వ్యక్తుల మాదిరిగానే వ్యవహరిస్తున్నట్టు సమాచారం. వీరిద్దరూ మానసికంగా కోలుకుంటే ఈ కేసు చిక్కుముడి వీడుతుంది. దీనికోసం నిందితులిద్దరినీ విశాఖ ఆసుపత్రికి తరలించనున్నారు. శనివారం నాడు చిత్తూరు ఏఆర్ పోలీసులకు ఎస్కార్ట్ కోరుతూ నివేదిక పంపినట్లు మదనపల్లె స్పెషల్ సబ్‌జైలు సూపరింటెండెంట్ రామకృష్ణయాదవ్ చెప్పారు. ఎస్కార్ట్ ఇచ్చిన వెంటనే నిందితులిద్దరినీ చికిత్స నిమిత్తం విశాఖ ఆసుపత్రికి తరలించనున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com