ఐయామ్ శివ.. నా గొంతులో హాలాహలం ఉంది: పద్మజ

  • IndiaGlitz, [Wednesday,January 27 2021]

మదనపల్లె అక్కా చెల్లెళ్ల కేసులో నిందితురాలు పద్మజ క్షణానికో విధంగా ప్రవర్తిస్తున్నారు. తన భర్తను భర్తే కాదంటూ హడలెత్తిస్తున్నారు. ‘లోక కళ్యాణం పూర్తయింది. నాకు ప్రాణం లాంటి బిడ్డలు దైవం చెంతకు చేరుకున్నారు. నేనే శివాను. నేనే దేవున్ని. కరోనా చైనా నుంచి రాలేదు. శివుని వెంట్రుక నుంచే వచ్చింది. నేను శివున్ని అయితే, నాకు ఎందుకు కరోనా వస్తుంది? నాకు కరోనా పరీక్ష ఎందుకు’ అంటూ పద్మజ వాపోయారు. అనంతరం ఆమెకు కరోనా పరీక్ష కోసం శాంపిల్స్ సేకరించారు. ఆ సమయంలో తన గొంతులో హలాహలం ఉందంటూ పద్మజ హడావుడి చేశారు.

ఇంటి నుంచి స్టేషన్‌కు తరలించే క్రమంలోనూ..

మంగళవారం విచారణ కోసం పద్మజను ఇంటి నుంచి పోలీస్‌స్టేషన్‌కు తీసుకొచ్చే క్రమంలోనూ ఆమె పెద్ద రాద్దాంతమే చేశారు. తాను రానంటూ మొండికేశారు. పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చే సమయంలోనూ.. తీసుకొచ్చిన తర్వాత సైతం ఆమె చాలా హడావుడి చేశారు. ‘ఐ యామ్‌ నాట్‌ థీఫ్‌. ఐ యామ్‌ లార్డ్డ్‌ శివ. మరి నన్నెందుకు స్టేషన్‌కు రమ్మంటున్నారు?’ అంటూ ప్రశ్నించారు. స్టేషన్‌కు తీసుకొచ్చాక సైతం.. ‘నేనే శివున్ని’ అంటూ కేకలు పెట్టారు. సీఐ శ్రీనివాసులు, ఎస్‌ఐ దిలీప్‌కుమార్‌ ఆమెను స్టేషన్‌లోకి తీసుకెళ్లి విచారించబోగా ఏమాత్రం సహకరించలేదు. దీంతో అక్కడే ఉన్న పురుషోత్తమ నాయుడిని పోలీసులు విచారించి ప్రాథమిక సమాచారం రాబట్టారు.

యూ ఆర్ నాట్ మై హజ్బెండ్..

అంతా తన బిడ్డలు చనిపోయారని అనుకుంటున్నారని.. వారు బతికే ఉన్నారంటూ పద్మజ స్పష్టం చేశారు. భార్యాభర్తలను కరోనా పరీక్షకు తీసుకెళ్లిన సమయంలో ‘నేను చెబుతున్నా.. చేయించుకో’ అంటూ భర్త పురుషోత్తమ నాయుడు చెప్పగా, పక్కనే ఉన్న కానిస్టేబుల్‌ మీ భర్త చెబుతున్నారని సూచించగా, యూ ఆర్ నాట్‌ మై హజ్బెండ్‌ అంటూ గట్టిగా అరిచి చెప్పారు. తాను శివుడినని చేతులు తిప్పుతూ వెల్లడించారు. ఆదివారం రాత్రి ఇంటికెళ్లిన పోలీసులతో ప్రాధేయపడుతూ మాట్లాడిన పద్మజ ప్రవర్తనలో రెండురోజుల్లోనే అనూహ్యమైన మార్పు కనిపించింది. దీంతో అటు పోలీసులు, ఇటు వైద్యులు ఆందోళనకు గురయ్యారు.

మానసిక స్థితి సరిగా లేదు..

కాగా.. పద్మజతో పాటు ఆమె భర్త పురుషోత్తం నాయుడుల మానసిక స్థితి సరిగా లేదని తాము గుర్తించినట్టు ప్రభుత్వాసుపత్రి మానసిక వైద్యురాలు రాధిక తెలిపారు. ఆమె విలేకరులతో మాట్లాడుతూ.. వారిద్దరూ ఆధ్యాత్మికత అనే దానిని దాటిపోయి ట్రాన్స్‌లో ఉన్నారని పేర్కొన్నారు. వారికి ఈ సమయంలో చికిత్స అందించి కౌన్సెలింగ్ ఇస్తే కోలుకునే అవకాశముందని రాధిక వెల్లడించారు.

More News

ఆస్కార్‌కు నామినేట్ అయిన 'ఆకాశం నీ హద్దురా'!

సూర్య, అపర్ణ బాలమురళి జంటగా నటించిన చిత్రం ‘ఆకాశం నీ హద్దురా’. ఎయిర్‌ డెక్కన్‌ అధినేత జీఆర్‌ గోపీనాథ్‌ ఆత్మకథ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది.

'ఆచార్య' టీజర్ వస్తుందనుకుంటే అప్‌డేట్ ఇచ్చారు

మెగాస్టార్‌ చిరంజీవి, కాజల్‌ అగర్వాల్‌ హీరోహీరోయిన్లుగా సక్సెస్‌ఫుల్‌ డైరెక్టర్‌ కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.

ఎర్రకోటపై జెండా ఎగరేసింది బీజేపీ వ్యక్తేనట

గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేశ రాజధాని ఢిల్లీ అట్టుడికింది! అన్నదాతలు తలపెట్టిన కిసాన్‌ పరేడ్‌ దేశ రాజధాని ఢిల్లీని రణరంగంగా మార్చింది. ఒక్కసారిగా దేశమంతా ఢిల్లీపైనే దృష్టి సారించేలా చేసింది.

ఆర్‌బీఐ కీలక నిర్ణయం.. డిజిటల్ కరెన్నీని...

ప్రస్తుతం నడుస్తున్నది డిజిటల్ యుగం. కాబట్టి నగదు కూడా డిజిటల్ కరెన్సీ రూపంలో లభ్యమైతే ఎలా ఉంటుంది? ఊహ అయితే బాగానే ఉంది కానీ ఇది సాధ్యమా అనిపిస్తోంది కదా..

పద్మ పురస్కారాలతో ప్రతిభాశీలురకు పట్టం: పవన్

గాన గంధర్వుడు దివంగత ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం గారిని ‘పద్మవిభూషణ్’ పురస్కారానికి ఎంపిక చేయడం ముదావహమని జనసేన అధినేత పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.