మ్యాచ్ రద్దు..‘వందేమాతరం’ అంటూ దద్దరిల్లిన స్టేడియం!
- IndiaGlitz, [Monday,January 06 2020]
టీమిండియా- శ్రీలంక మధ్య గౌహతి వేదికగా జరగాల్సిన మొదటి టీ20 మ్యాచ్ రద్దయిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌కు టాస్ వేసినప్పటికీ వర్షం కారణంగా ఆట సాధ్యం కాలేదు. దీంతో ఒక్కటంటే ఒక్క బంతి కూడా పడకుండానే మ్యాచ్‌ను రద్దు చేయడం జరిగింది. పూర్తి వివరాల్లోకెళితే.. 6.45 నుంచి భారీగానే వర్షం కురిసింది. టీమిండియా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. గౌహతి పిచ్ బ్యాటింగ్‌కు బాగా అనుకూలిస్తుందన్న నేపథ్యంలో కెప్టెన్ విరాట్ కోహ్లీ ఛేజింగ్ చేసేందుకు మొగ్గుచూపాడు. మ్యాచ్‌కు ముందు మొదలైన వర్షం అంతరాయం కలిగించడంతో మ్యాచ్ నిర్వహణ సాధ్యపడలేదు. ఇరు జట్ల మధ్య రెండో టీ20 మ్యాచ్ ఎల్లుండి ఇండోర్‌లో జరగనుంది.
దద్దరిల్లిన స్టేడియం!
ఇదిలా ఉంటే.. మ్యాచ్ తిలకించడానికి వచ్చిన భారతీయులు, క్రీడాభిమానులు ఒక్కసారిగా లేచి ‘వందేమాతరం.. వందేమాతరం’ అంటూ పాట పాడారు. ఈ పాటతో స్టేడియం ఒక్కసారిగా దద్దరిల్లింది. ఈ పాటతో క్రీడాభిమానులు తమ దేశభక్తిని చాటుకున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఈ వీడియోను బీసీసీఐ కూడా తన ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. మ్యాచ్ రద్దయ్యిందని కొందరు నిరాశగా ఉన్నప్పటికీ ఈ వీడియో చూసి ఎంతగానో సంతృప్తి పడ్డామని నెటిజన్లు, క్రీడాభిమానులు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. మరికొందరు ఈ వీడియో చూసినోళ్లకు గూస్‌బంప్స్ అని.. అందరి నోటా ఒకేసారి ఈ పాట రావడం నిజంగా చాలా గ్రేట్ అంటూ కామెంట్స్ చేస్తూ.. బీసీసీఐ పోస్ట్ చేసిన ఈ పాటను పెద్ద ఎత్తున షేర్ చేస్తున్నారు. ఇక ఆలస్యమెందుకు మీరూ ఈ వీడియోపై ఓ లుక్కేయండి.