'మాంజ' మోషన్ పోస్టర్ విడుదల
Send us your feedback to audioarticles@vaarta.com
కిషన్ ఎస్.ఎస్, అవికా గోర్, దీప్ పాథక్, నరేష్ డింగ్రి, ఈషా డియోల్, జయ కార్తీక్ ప్రధాన తారాగణంగా గిరిధర్ ప్రొడక్షన్ హౌస్ బ్యానర్‌పై రాజ్ కందుకూరి సమర్పణలో కిషన్ ఎస్.ఎస్ దర్శకత్వంలో గిరిధర్ మామిడిపల్లి, పద్మజ మామిడిపల్లి నిర్మాతలుగా రూపొందుతోన్న చిత్రం మాంజ`. ఈ సినిమా మోషన్ పోస్టర్ విడుదల కార్యక్రమం గురువారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో కిషన్ ఎస్.ఎస్, శ్రీకాంత్ హెచ్.ఆర్, గిరిధర్ మామిడిపల్లి, పద్మజ మామిడిపల్లి, అవికాగోర్, డా.చల్లా భాగ్యలక్ష్మి, వంశీ చంద్ర వట్టికూటి, సురేష్ గంగుల తదితరులు పాల్గొన్నారు. హీరోయన్ అవికాగోర్ మోషన్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా జరిగిన పాత్రికేయుల సమావేశంలో...
హెచ్.ఆర్.శ్రీకాంత్ మాట్లాడుతూ కిషన్ మూడేళ్ళ వయసులోనే హ్యండీ కామ్ తో వర్క్ చేయడం స్టార్ట్ చేశాడు. మూడున్నరేళ్ళ వయసులోనే మోడల్ అయ్యాడు. నాలుగేళ్ళ వయసు నుండి సినిమాలకు సంబంధించిన ఎడిటింగ్,సౌండ్ ఇంజనీరింగ్ వర్క్స్ నేర్చుకున్నాడు. తన ఇంట్రెస్ట్ ను గమనించి తనని ఎంకరేజ్ చేశాను. 9ఏళ్ళ వయసులోనేకేరాఫ్ ఫుట్‌పాత్` చిత్రాన్ని డైరెక్ట్ చేస్తానన్నాడు. ముందు కొద్దిగా ఆలోచించాను కానీ చివరకు కొంత మంది శ్రేయోభిలాషుల సపోర్ట్ తో సినిమాని నిర్మించాం. ఆ సినిమాకుగానూ కిషన్ కు 11 ఇంటర్నేషనల్ అవార్డ్స్ వచ్చాయి. ఇప్పుడు రియల్‌గా జరిగిన ఘటలను ఆధారంగా కేరాఫ్ ఫుట్‌పాత్`2` చిత్రాన్ని డైరెక్ట్ చేశాడు. డిఫరెంట్ మూవీగా అందరికీ నచ్చే మూవీ అవుతుంది`` అన్నారు.
అవికాగోర్ మాట్లాడుతూ ఇటువంటి పాత్రను చేయగలననే నమ్మకంతో నాకు ఈ సినిమాలో అవకాశం ఇచ్చినందకు దర్శక, నిర్మాతలకు ధన్యవాదాలు. ఈ సినిమాలో భాగమైనందుకు చాలా హ్యపీగా ఉంది. తెలుగులో లక్ష్మీరావే..మా ఇంటికి` చిత్రం తర్వాత ఈ సినిమా గిరిధర్గారితో చేస్తున్నందుకు సంతోషంగా ఉంది. కిషన్‌గారు సినిమా చక్కగా డైరెక్ట్ చేశారు. డిఫరెంట్ మూవీ. సినిమా తప్పకుండా అందరికీ నచ్చుతుంది`` అన్నారు.
చిత్ర దర్శకుడు కిషన్ ఎస్.ఎస్ మాట్లాడుతూ రెండు సంవత్సరాల క్రితం ఓ కార్యక్రమంలో బాలనేరస్థులను కలిశాను. వారు చిన్న వయసలులోనే అనేక నేరాలు చేశారని తెలుసుకున్నాను. అక్కడ వారి గురించి చాలా విషయాలను తెలుసుకున్నాను. వాటి ఆధారంగా చేసుకుని ఫుట్ పాత్2 ఈ సినిమా కథను తయారుచేశాను. ఇప్పటి వరకు ఎవరూ టచ్ చేయని కాన్సెప్ట్. గాలిపటం ఎగురవేసే సమయంలో దారానికి బలం కోసం గాజుతో కూడిన గుజ్జును పూస్తారు. ఆ మిశ్రమాన్నే మాంజ అంటారు. ఇది ఆడుకోవడానికి ఎలాగైతే ఉపయోగపడుతుందో, గొంతుకు తగిలితే ప్రాణం పోయే అవకాశం కూడా ఉంది. అందుకే ఈ సినిమాకి ఆటకైనా వేటకైనా ట్యాగ్‌లైన్ పెట్టాం`. అవికాగోర్ చాలా నేచురల్‌గా నటించారు. ఈ చిత్రాన్ని ఆస్కార్ అవార్డ్స్ జనరల్ కేటగిరిలో లేట్రల్ ఎంట్రీ కోసం సబ్మిషన్ చేయడం జరిగింది. సదరు కమిటీవారు త్వరలోనే ఈ సినిమాని చూసి నిర్ణయం తీసుకోనున్నారు. ఇదొక జూనియర్ అఫెండర్స్ కు సంబంధించిన మూవీ. జూనియర్ అఫెండర్స్ ను సమాజం ఎలా ట్రీట్ చేస్తుందనేదే సినిమా కాన్సెప్ట్. రియాల్టికీ దగ్గరగా షూట్ చేశాం``అన్నారు.
చిత్ర నిర్మాత గిరిధర్ మామిడిపల్లి మాట్లాడుతూ నిర్మాతగా నేను అవికాగోర్‌తో లక్ష్మీ రావే..మా ఇంటికి` సినిమా చేస్తున్నప్పుడు, అవికాగోర్ ఈ సినిమా షూటింగ్ చేస్తుండేది. అప్పుడు నేను కూడా లోకేషన్ కి వెళ్ళేవాడిని కిషన్, శ్రీకాంత్ గారు సినిమా కోసం పడే తపన చూసి నాకు ఆశ్చర్యమేసింది. ఓ రోజు శ్రీకాంత్ గారి వద్ద ఈ సినిమా పాయింట్ తెలుసుకుని థ్రిల్ ఫీలయ్యాను. ఈ సినిమాను తెలుగులో నేను విడుదల చేస్తానన్నాను. కిషన్‌గారు నాపై నమ్మకంతో ఈ అవకాశం నాకు కల్పించారు. త్వరలోనే ఆడియో రిలీజ్ చేసి, సినిమాని వచ్చే నెలలో తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో ఒకేసారి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం`` అన్నారు.
మాటల రచయిత వంశీ చంద్ర వట్టికూటి మాట్లాడుతూ చాలా డిఫరెంట్ మూవీ. ఇప్పటి వరకు ఎవరూ టచ్ చేయని పాయింట్‌తో తెరకెక్కింది. కిషన్, శ్రీకాంత్, గిరిధర్‌గారు దగ్గరుండి మంచి సంభాషణలను రాయించుకున్నారు. అవకాశం ఇచ్చినందుకు దర్శక నిర్మాతలకు థాంక్స్`` అన్నారు.
సురేష్ గంగుల మాట్లాడుతూ ఈ సినిమాలో మంచి సాంగ్ రాసే అవకాశం ఇచ్చినందుకు కిషన్, శ్రీకాంత్‌గారికి థాంక్స్``అన్నారు.
డా.చల్లాభాగ్యక్ష్మి మాట్లాడుతూ ఆరేళ్ళ క్రితం ఈ చిత్ర దర్శకుడు కిషన్‌ను ఇంటర్వ్యూ సందర్భంగా కలిశాను. తను చాలా ఇన్స్పిరేషనల్గా మాట్లాడాడు. తన దర్శకత్వంలో నేను ఒక సాంగ్ రాయడం ఆనందంగా ఉంది. మంచి పిలసాఫికల్ సాంగ్ రాశాను. ఈ అవకాశం ఇచ్చినందుకు దర్శక నిర్మాతలకు థాంక్స్`` అన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com