'మా వింతగాథ వినుమా' ప్రీ రిలీజ్
- IndiaGlitz, [Thursday,November 12 2020]
హండ్రెడ్ పర్సెంట్ తెలుగు ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ ‘ఆహా’.. తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువవుతుంది. వరుస బ్లాక్‌బస్టర్ చిత్రాలతో ప్రేక్షకులను ‘ఆహా’ ఆకట్టుకుంటోంది. నవంబర్ నెలను మరింత ఎంటర్టైన్మెంట్గా ఆహా మారుస్తుంది. అందులో భాగంగా నవంబర్ 13న ‘మా వింతగాథ వినుమా’ చిత్రం ఆహాలో విడుదలవుతుంది. ఆదిత్య మండల దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ‘కృష్ణ అండ్ హిజ్ లీల’ చిత్రంలో జోడీగా నటించిన సిద్దు జొన్నలగడ్డ, శీరత్‌కపూర్ ఇందులో జంటగా నటించారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ బుధవారం జరిగింది.
ఈ కార్యక్రమంలో ....
కమల్ కామరాజు మాట్లాడుతూ -''సిద్ధులో అమేజింగ్ టాలెంట్ ఉంది. సినిమాలంటే ప్యాషన్ ఉన్న వ్యక్తి. మంచి నటుడే కాదు. మంచి రైటర్ కూడా. ఇక ఈ సినిమా విషయానికి వస్తే.. మహిళలు, అమ్మాయిల ఆలోచనా శైలిని తెలియజేసే ఈ కథను సిద్ధు రాశాడు. ఆహా ఈ సినిమాను తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నందుకు వారికి థాంక్స్. ఆదిత్య సహా ఎంటైర్ టీమ్‌కు అభినందనలు'' అన్నారు.
కల్పిక మాట్లాడుతూ - ''క్యారెక్టర్‌ను నెరేట్ చేసినప్పుడు పాత్ర బాగా నచ్చింది. ఈ క్యారెక్టర్‌ను క్యారీ చేయగలనో లేదోనని ఆలోచించాను. సిద్ధు అన్నీ విభాగాల్లో భాగమవుతూ తనదైన గుర్తింపును సంపాదించుకున్నారు. ఆదిత్య నాకు ఫ్యామిలీ మెంబర్‌లాంటి వ్యక్తి. మంచి కాన్సెప్ట్‌తో తెరకెక్కించిన ఈ సినిమాను ఆహా వారు విడుదల చేస్తున్నారు. యూత్ నేటి కాలంలో ఎలా ఆలోచిస్తున్నారు. ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు. దాని వల్ల ఎలాంటి పరిస్థితులు ఎదురవుతున్నాయనే కాన్సెప్ట్‌తో ఈ సినిమా తెరకెక్కింది. తప్పకుండా అందరికీ నచ్చుతుంది'' అన్నారు.
శీరత్ కపూర్ మాట్లాడుతూ - ''కోవిడ్ సమయంలో ఈ సినిమాతో మీ ముందుకు రావడం కాస్త కొత్త అనుభూతినిస్తుంది. డైరెక్టర్ ఆదిత్య నన్ను ఈ సినిమా గర్ల్ నెక్ట్స్ డోర్గా చూపించాడు. నిర్మాతలకు థాంక్స్. అలాగే మా సినిమాను ప్రేక్షకులకు అందిస్తున్న ఆహాకు ధన్యవాదాలు. సిద్ధు ఫెంటాస్టిక్ స్క్రిప్ట్‌ను రాసి నటించాడు. ఎంటైర్ టీమ్‌కు థాంక్స్. రన్‌రాజారన్ తర్వాత ఈ సినిమాలో నా పాత్ర మీ అందరికీ తప్పకుండా నచ్చుతుంది'' అన్నారు.
దర్శకుడు ఆదిత్య మండల మాట్లాడుతూ - ''దర్శకుడిగా తొలి సినిమా. నా గుండెల్లో ఈ సినిమాకెప్పుడు ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. అద్భుతమైన టీమ్‌తో కలిసి పనిచేశాను. అందరితో ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యాను. రోహిత్, జాయ్, శ్రీచరణ్‌పాకాల అద్భుతమైన సంగీతాన్ని అందించారు. కమల్, కల్పిక, ప్రగతిగారు, భరణిగారు ఇలా అందరూ ఈ సినిమాను తమదిగా భావించి చేశారు. సిద్ధు జొన్నలగడ్డ లేకుండా ఈ సినిమా అయ్యుండేదికాదు. నిర్మాతలు సంజయ్‌రెడ్డి, సునీత,కీర్తిగారికి, అనీల్ రెడ్డిగారికి థాంక్స్. మా సినిమాను ప్రేక్షకులకు అందిస్తున్న ఆహాకు ఈ సందర్భంగా థాంక్స్ చెబుతున్నాను'' అన్నారు.
సిద్ధు జొన్నలగడ్డ మాట్లాడుతూ - ''నిర్మాతలు సంజయ్‌రెడ్డి, సునీత,కీర్తిగారికి, అనీల్ రెడ్డిగారికి థాంక్స్. ఎందుకంటే వారు నాపై నమ్మకంతో నాకు సపోర్ట్ అందించారు. ఆదిత్య సినిమాను చక్కగా హ్యాండిల్ చేశాడు. ఈ సినిమా థియేటర్స్‌లో విడుదల కావడం లేదనే ఆలోచనను నాలో నుండి ఆహా టీం తీసేసింది. అంత గొప్పగా సినిమాను ప్రమోట్ చేస్తున్నారు. నాతో పాటు మూడేళ్లు ప్రయాణించిన ప్రతి ఒక్కరికీ థాంక్స్. నవంబర్ 13న హండ్రెడ్ పర్సెంట్ తెలుగు యాప్ ఆహాలో మా వింతగాథ వినుమా సినిమా విడుదలవుతుంది. అందరికీ నచ్చుతుంది'' అన్నారు.
డైరెక్టర్ క్రిష్ మాట్లాడుతూ - ''ట్రైలర్ చూసిన తర్వాత సిద్ధు కోసం, ఆహా కోసం ఈవెంట్‌కు వచ్చాను. సిద్ధులో చాలా టాలెంట్ ఉంది. ఆహా ప్రతిసారి ఓ కంటెంట్‌ను తీసుకున్నప్పుడు దానికి చాలా ప్రాధాన్యతనిస్తారు. నవంబర్ 13న నేను కూడా ఈ సినిమాను చూడటానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. ఓ టీమ్‌ను ఏర్పాటు చేసుకుని సినిమా చేయడమనేది ఈవెంట్ చూస్తేనే అర్థమవుతుంది. గ్రేట్ టీం.. ప్యాషన్ ఉన్న టీం. ఎంటైర్ టీమ్‌కు ఆల్ ది వెరీ బెస్ట్'' అన్నారు.