'సినిమా చూపిస్త మావ' శాటిలైట్ హక్కులు వీరివే..
Send us your feedback to audioarticles@vaarta.com
ఉయ్యాల జంపాల` జంట రాజ్‌తరుణ్-అవికాగోర్ నటిస్తున్న సినిమా చూపిస్త మావ` చిత్రాన్ని ఆగస్టు 14న విడుదలవుతుంది. అంజిరెడ్డి ప్రొడక్షన్స్-ఆర్.డి.జి ప్రొడక్షన్స్ ప్రై॥లి॥ సంయుక్త సమర్పణలో.. ఆర్యత్ సినీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో కలిసి లక్కీ మీడియా పతాకంపై రూపొందిన ఈ చిత్రానికి త్రినాధరావు నక్కిన దర్శకత్వం వహాంచరు. బోగాది అంజిరెడ్డి-బెక్కెం వేణుగోపాల్ (గోపి)- రూపేష్ డి.గోహిల్- జి.సునీత నిర్మాతలు.
మాస్ హీరోకి, బాగా చదువుకునే అమ్మాయి మధ్య ప్రేమ ఎలా పుట్టింది. ఆ యువకుడు తన ప్రేమను గెలిపించుకోవడానికి ఏం చేస్తాడు. మామ, అల్లుడు మధ్య ఎలాంటి పోటీ జరుగుతుందనేదే కాన్సెప్ట్. ఈ చిత్రాన్ని నైజాంలో దిల్ రాజు విడుదల చేశారు. ఈ సినిమా టేబుల్ ప్రాఫిట్ తో విడుదలవుతుందని నిర్మాతలు తెలియజేశారు. ఈ సినిమా శాటిలైట్ హక్కులను మా` టీవీ చేజిక్కించుకున్నారని కూడా నిర్మాతలు తెలియజేశారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments