ఇక పై 'మా' తక్షణ సహాయం 2లక్షలు!

  • IndiaGlitz, [Thursday,May 11 2017]

'మా' (మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్ సంఘం) మెంబ‌ర్ల సంక్షేమ‌మే ల‌క్ష్యంగా ముందుకు వెళ్తోంది. ఇటీవ‌ల శివాజీ రాజా అధ్య‌క్ష‌త‌న ఏర్పాటైన నూత‌న కార్య‌వ‌ర్గం 'మా' అభివృద్ధిలో భాగంగా కొత్త కార్య‌క్ర‌మాలు చేప‌ట్టే దిశ‌గా అడుగులు వేస్తోంది.
'మా' టీమ్ లో ఆర్ధికంగా వెనుక‌బ‌డిన వారు చ‌నిపోయిన‌ప్పుడు ద‌హ‌న సంస్కార కార్య‌క్ర‌మాలు నిమిత్తం కొంత అమౌంట్ ను అప్ప‌టిక‌ప్పుడు ఉరు కులు..ప‌రుగులు మీద అందించ‌డం జ‌రుగుతుంది. అయితే ఇప్పుడు ఆ ప‌ద్ధ‌తికి స్వ‌స్థి ప‌లుకుతు కొత్త ప‌ద్ధ‌తికి శ్రీకారం చుట్టారు. మా టీమ్ లో మెంబ‌ర్ పేరిట ఉన్న డెత్ ఇన్స్ రెన్స్ క్లైమ్ క్రింద త‌క్ష‌ణం 2 ల‌క్ష‌ల రూపాయ‌ల‌ను చ‌నిపోయిన రోజునే అందించ‌డం జ‌రుగుతుంద‌ని 'మా' అధ్య‌క్షులు శివాజీ రాజా తెలిపారు.
ఇంకా ఆయ‌న మాట్లాడుతూ, ' 'మా'తో 20 ఏళ్ల నుంచి అనుబంధం ఉంది. ఇన్నేళ్ల అనుభ‌వంలో ఎన్నో విష‌యాల‌ను తెలుసుకున్నాను. మా మెంబ‌ర్ల‌లో ఎవ‌రైనా పేద క‌ళా కారులు చ‌నిపోయిన‌ప్పుడు ఆ స‌మ‌యంలో ద‌హ‌న సంస్కార కార్య‌క్ర‌మాలు సైతం పూర్తి చేయ‌లేని స్థితిలో ఉంటున్నారు. అలాంటి స‌మ‌యంలో 'మా' నుంచి 5000, 10000 రూపాయ‌ల ఆర్ధిక స‌హాయం అందేది. అయితే ఇక‌పై అలా కాకుండా త‌క్ష‌ణ ప‌రిష్కారంగా 2 ల‌క్ష‌ల రూపాయ‌ల‌ను వెంట‌నే అందించ‌డం జ‌రుగుతుంది. త‌ర్వాత మెంబ‌ర్ పేరిట ఉన్న 2 ల‌క్ష‌ల ఇన్సురెన్స్ క్లైమ్ ను 'మా' లో జ‌మ చేసుకుంటాం' అని తెలిపారు.
కొత్త‌గా ఏర్పాటైన 'మా' టీమ్ ఇలాంటి కార్య‌క్ర‌మాలు చేయ‌డం చాలా సంతోషంగా ఉంద‌ని 'మా' మాజీ అధ్య‌క్షులు ముర‌ళీ మోహ‌న్ హ‌ర్షం వ్య‌క్తం చేశారు.

More News

ఈ నెలఖరున గోల చేస్తామంటున్న 'ప్రేమలీల..పెళ్లి గోల' టీమ్!

రెండు దశాబ్ధాలకు పైగా రాయలసీమలో నాలుగు వందలకు పైగా చిత్రాలను పంపిణీ చేసిన శ్రీ మహావీర్ ఫిలిమ్స్ నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే.

జూన్ 2న రాజ్ తరుణ్ 'అంధగాడు'

మల్టీ టాలెంటెడ్,ఎనర్జిటిక్ యాక్టర్ రాజ్ తరుణ్ పుట్టినరోజు నేడే(మే 11).

తెలుగు రాష్ట్రాల్లో 150 కోట్ల 'బాహుబలి-2' వివరాలివిగో....

తెలుగు సినిమాకు పరిమితులుంటాయనే ఆలోచనలను తిరగరాసిన సినిమా 'బాహుబలి-2'.

'స్పైడర్' మరోసారి వాయిదా పడుతుందా...

సూపర్స్టార్ మహేష్, ఎ.ఆర్.మురుగదాస్ కాంబినేషన్లో రూపొందుతోన్న స్పై థ్రిల్లర్ `స్పైడర్` చిత్రీకరణను జరుపుకుంటుంది. నిజానికి ఈ సినిమాను జూన్ 23న విడుదల చేయబోతున్నట్లు నిర్మాతలు ప్రకటించారు.

బాహుబలి సక్సెస్ లో ప్రభాస్ కు క్రెడిటే లేదట...

ప్రపంచాన్ని తన వైపు తిప్పుకున్న తెలుగు సినిమా బాహుబలి.