మా 'ఆధ్వర్యంలో ఘనంగా' ఏడిద శ్రీరామ్ పుట్టినరోజు వేడుక!
- IndiaGlitz, [Thursday,December 28 2017]
సీనియర్ నటుడు, 'మా' అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ ఏడిద శ్రీరామ్ పుట్టిన రోజు (నేడు). ఈ సందర్భంగా 'మా' కార్యాలయంలో మెంబర్లు..సభ్యుల సమక్షంలో ఘనంగా జన్మదినోత్సవం జరిగింది. ముందుగా 'మా' అధ్యక్షుడు శివాజీ రాజా, శ్రీరామ్ కు కేక్ తినిపించి శుభాకాంక్షలు తెలిపారు.
అనంతరం 'మా' వైస్ ప్రెసిడెంట్ ఎమ్. వి. బెనర్జీ, జాయింట్ సెక్రటరీ హేమ, కల్చరల్ కమిటీ చైర్మన్ సురేష్ కొండేటి, కార్యవర్గ సభ్యుడు సురేష్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా శ్రీరామ్ ను 'మా' తరుపున సాలువా తో సన్మానించారు.
అలాగే 'మా' ఘనంగా నిర్వహిస్తోన్న సిల్వర్ జూబ్లీ వేడుకల్లో భాగంగా 'మా' 25 వసంతాల జ్ఞాపికను కూడా అందజేశారు. అనంతరం శ్రీరామ్ , పేదకళాకారులకు సహాయార్ధం రూ.5000 లను 'మా' కు అందించారు. ఈ కార్యక్రమంలో 'మా' కు సంబంధించిన పలువురు పాల్గొన్నారు.