మా 'ఆధ్వ‌ర్యంలో ఘ‌నంగా' ఏడిద శ్రీరామ్ పుట్టినరోజు వేడుక‌!

  • IndiaGlitz, [Thursday,December 28 2017]

సీనియ‌ర్ న‌టుడు, 'మా' అసోసియేష‌న్ జాయింట్ సెక్ర‌ట‌రీ ఏడిద శ్రీరామ్ పుట్టిన రోజు (నేడు). ఈ సంద‌ర్భంగా 'మా' కార్యాల‌యంలో మెంబ‌ర్లు..స‌భ్యుల స‌మ‌క్షంలో ఘ‌నంగా జ‌న్మ‌దినోత్స‌వం జ‌రిగింది. ముందుగా 'మా' అధ్య‌క్షుడు శివాజీ రాజా, శ్రీరామ్ కు కేక్ తినిపించి శుభాకాంక్ష‌లు తెలిపారు.

అనంత‌రం 'మా' వైస్ ప్రెసిడెంట్ ఎమ్. వి. బెన‌ర్జీ, జాయింట్ సెక్ర‌ట‌రీ హేమ‌, క‌ల్చ‌ర‌ల్ క‌మిటీ చైర్మ‌న్ సురేష్ కొండేటి, కార్య‌వ‌ర్గ స‌భ్యుడు సురేష్ శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు. ఈ సంద‌ర్భంగా శ్రీరామ్ ను 'మా' త‌రుపున సాలువా తో స‌న్మానించారు.

అలాగే 'మా' ఘ‌నంగా నిర్వ‌హిస్తోన్న సిల్వ‌ర్ జూబ్లీ వేడుక‌ల్లో భాగంగా 'మా' 25 వ‌సంతాల‌ జ్ఞాపిక‌ను కూడా అంద‌జేశారు. అనంత‌రం శ్రీరామ్ , పేద‌క‌ళాకారుల‌కు స‌హాయార్ధం రూ.5000 ల‌ను 'మా' కు అందించారు. ఈ కార్య‌క్ర‌మంలో 'మా' కు సంబంధించిన ప‌లువురు పాల్గొన్నారు.

More News

ఆదిత్య మ్యూజిక్ సంస్థకు మధురానుభూతిని మిగిల్చిన ఏడాదిగా 2017

రెండు దశాబ్దాలుగా మ్యూజిక్ రంగంలో నెంబర్ వన్గా రాణిస్తున్న సంస్థ ఆదిత్య మ్యూజిక్ సంస్థకు 2017 మధురానుభూతిని మిగిల్చింది. ఈ సందర్భంగా మ్యూజికల్గా సెన్నేషనల్ హిట్ మూవీస్ను అందించిన తెలుగు మ్యూజిక్ లవర్స్కు కృతజ్ఞతలు తెలియజేస్తుంది.

'కృష్ణార్జున యుద్ధం'...ఏప్రిల్ 12న గ్రాండ్ రిలీజ్

'ఎవడే సుబ్రమణ్యం నుండి రీసెంట్గా విడుదలైన 'ఎంసీఏ' వరకు ఎనిమిది వరుస సక్సెస్ ఫుల్ చిత్రాలతో

'బాహుబలి 2' రికార్డులను టైగర్ అధిగ మిస్తుందా?

సల్మాన్ ఖాన్ హీరోగా అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'టైగర్ జిందా హై'.

'జైసింహా' కు గుమ్మడికాయ కొట్టేశారు...

నటసింహ నందమూరి బాలకృష్ణ 102వ చిత్రం 'జై సింహా' ప్యాచ్ వర్క్ సహా చిత్రీకరణను పూర్తి చేసుకుంది.

ఆ విష‌యంపై సునీల్ క్లారిటీ ఇచ్చేశాడు?

క‌మెడియ‌న్ నుండి హీరోగా మారిన సునీల్‌కు ప్రారంభంలో అందాల రాముడు, పూల రంగ‌డు, మ‌ర్యాద‌రామ‌న్న‌సినిమాలు స‌క్సెస్ తెచ్చిపెట్టినా త‌ర్వాత అనుకున్న స్థాయిలో హిట్ ద‌క్క‌లేదు. దీంతో సునీల్ మ‌ళ్లీ క‌మెడియ‌న్‌గా న‌టించేందుకు స‌న్న‌ద్ధ‌మ‌వుతున్నాడ‌ని వార్త‌లు వినిపించాయి.