కీలక నిర్ణయాలు తీసుకున్న 'మా'
Send us your feedback to audioarticles@vaarta.com
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికలు ముగిసిన అనంతరం నరేష్ ప్యానెల్ ఫస్ట్ టైమ్ కీలక తీర్మానాలు చేసింది. ముందుగా మేనిఫెస్టోలో చెప్పినట్లుగా కొన్ని విషయాలను ఈ తీర్మానాల్లో అమలు చేయడానికి ప్యానెల్ ప్రయత్నాలు చేస్తోంది. 2019-21 సంవత్సరములకు గాను కమిటీ ఈ నిర్ణయాలు తీసుకుంది.
హెల్ఫ్‌లైన్ మరియు సలహాలు, ఫిర్యాదుల బాక్స్:
మా సభ్యుల సౌలభ్యం కొరకు ‘మా’కు హెల్ఫ్‌లైన్ నంబర్ తీసుకోవడమైనది హెల్ఫ్‌లైన్ నంబర్ 9502030405 దయచేసి ఈ నంబర్ ‘మా’ సభ్యులందరూ తమ మొబైల్ ఫోన్లో నమోదు చేసుకొని ముఖ్యమైన, అత్యవసర పనుల నిమిత్తం ఈ మొబైల్ నంబర్‌కు కాల్ చేసి తగిన సలహాలను పొందగలరు.
పెన్షన్ గురించి చర్చ:
01-04-2019 నుంచి పెన్షన్ వెయ్యి రూపాయిలు పెంచి ఆరువేల రూపాయిలు నేరుగా 30 మంది పెన్షన్ దారుని యొక్క బ్యాంకు ఖాతాలో జమచేయడమైనది. ఈ యొక్క పెంచిన వెయ్యి రూపాయిలు పెన్షన్ దారునికి వైద్య ఖర్చుల నిమిత్తం ఉపయోగపడుతుందని పెంచడమైనది.
ప్రభుత్వం యొక్క పథకాలను ‘మా’కు కూడా వర్తింపచేసేలా చర్చ:
‘మా’ అతి త్వరలో సభ్యులందరికీ ప్రభుత్వ పథకాలైన పెన్షన్, ఇల్లు, విద్య, కల్యాణలక్ష్మి, మొదలైన పథకాల గురించి ఒక లెటర్ ద్వారా తెలియజేయడమైనది.
‘మా’ సభ్యత్వం గురించి సమీక్ష
‘మా’లో కొత్తగా సభ్యత్వం తీసుకునే వారి గురించి రెండు రకాల సభ్యత్వాలు పెట్టడమైనది. 25000/- రూపాయులు సభ్యత్వ రుసుమును మొదట చెల్లించినచో గోల్డ్కార్డ్ను సభ్యునికి ఇవ్వడం జరుగుతుంది. ఈ గోల్డు కార్డు సమయ కాలం రెండు సంవత్సరాలు. ఈ రెండు సంవత్సరాల్లో మిగతా 75000/- వేల రూపాయిలు వాయిదా పద్ధతితలో చెల్లించబడి మొత్తం 10,00,00/- రూపాయిలు పూర్తి అయిన వెంటనే జీవితకాల సభ్యత్వ కార్డు ఇవ్వబడును. అప్పటి వరకూ అసోషియేట్ సభ్యునిగానే పరిగణించబడతారు. ఏ రకమైన సౌలభ్యములు ‘మా’ నుంచి వీరికి వర్తించవు. వీరు ఫ్రీ మెడికల్ క్యాంప్స్ మాత్రమే వినియోగించుకోగలుగుతారు.
రెండవ పద్దతి ప్రకారం ఒకేసారి సభ్యత్వ రుసుము 90,000/- చెల్లించినచో జీవిత కాల సభ్యత్వం ఇవ్వబడుతుంది. దీనివలన జీవిత కాల సభ్యత్వం పొందిన వారికి 10000/- రూపాయిలు రాయతీగా పొందగలుగుతారు. ఈ అవకాశం 100 రోజులు మాత్రమే అమలులో ఉంటుంది.
‘మా’ సభ్యులందరికీ ఉచితంగా ఎస్బీఐ సంపూర్ణ సురక్ష జీవిత భీమా:
ఈ పాలసీ ప్రకారం ప్రతి యొక్క సభ్యునికి 2లక్షల రూపాయిలు ఎస్బీఐ జీవిత భీమా పాలసీ ఇవ్వబడినది. ఈ పాలసీలో యాక్సిడెంటల్, సహజ మరణం సంభవించినచో సభ్యుని యొక్క కుటుంబానికి రెండు రూపాయిలు ఇవ్వడం జరుగుతుంది. ఈ పాలసీ 15/07/2018 లో లాప్స్ అవ్వడం జరిగింది. ఆ తర్వాత కొత్త కొటేషన్స్ తీసుకుని లక్ష రూపాయిలు పెంచి మూడు లక్షల రూపాయిల కవరేజ్‌ని 29/03/2019 నుంచి 321 బందికి కవరేజ్ ఇవ్వడం జరిగింది.
మేము ప్రమాణ స్వీకారం చేసిన 20 రోజుల్లోనే పైన చెప్పబడిన నిర్ణయాలు తీసుకోవడ్డాయి మీ యొక్క సహాయసహకారాలతో మున్ముంథు ఎన్నో కార్యక్రమాలు చేపడుతామని దృఢ సంకల్పముతో ‘మా’ అసోసియేషన్ ఓ ప్రకటనలో పేర్కొంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout