'మా' అధ్యక్షుడు శివాజీ రాజా పుట్టినరోజు వేడుకలు
Send us your feedback to audioarticles@vaarta.com
`మా` అధ్యక్షుడు శివాజీ రాజా పుట్టిన రోజు వేడుకలు సోమవారం ఉదయం `మా` కార్యాలయంలో నిడారంబరంగా జరిగాయి. `మా` కార్యవర్గ సభ్యులు..పలువురు ఆర్టిస్టులు కేక్ కట్ చేసి శివాజీ రాజాకు తినిపించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా `మా` కోసం పాటుపడుతోన్న శివాజీ రాజా నిరంతర కృషిని కొనియాడారు.
ఈ వేడుకల్లో సీనియర్ దర్శకులు ఎస్. వి. కృష్ణారెడ్డి, `మా` ఎగ్జిక్యుటివ్ వైస్ ప్రెసిడెంట్ శ్రీకాంత్, వైస్ ప్రెసిడెంట్ బెనర్జీ, జనరల్ సెక్రటరీ నరేష్, జాయింట్ సెక్రటరీ ఏడిద శ్రీరామ్, కల్చరల్ కమిటీ చైర్మన్ సురేష్ కొండేటి, కార్య వర్గ సభ్యులు సురేష్, గీతాసింగ్, వెంకట గోవిందరావు తదితరులు పాల్గొన్నారు. అలాగే ప్రతీ ఏడాది శివాజీ రాజా పుట్టిన రోజు సందర్భంగా బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిలో రోగులకు పళ్లు పంచుతుంటారు. ఈ ఏడాది కూడా తన బర్త్డ డే సందర్భంగా యధావిధిగా పళ్లు పంచడం జరిగింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com