'మా' సభ్యుల ఆరోగ్యమే మా ప్రధాన అంశం: 'మా' అధ్యక్షులు శివాజీరాజా
Send us your feedback to audioarticles@vaarta.com
ప్రపంచ కాలేయ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం ఉదయం మూవీ ఆర్టిస్టు అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉచిత లివర్ స్కానింగ్ క్యాంప్ కార్యక్రమం జరిగింది. ప్రముఖ డాక్టర్ డి.చంద్రశేకర్‌రెడ్డి గ్యాస్టో ఎన్టరాలజిస్టు సమక్షంలో ఉచితంగా లివర్ పరీక్ష మా` సభ్యులకు చేశారు. ఈ సందర్భంగా మూవీ ఆర్టిస్టు అసోసియేషన్ అధ్యక్షులు శివాజీ రాజా మాట్లాడుతూ.. మా` ప్రతీ సభ్యులు ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ మెడికల్ క్యాంప్‌ని ఏర్పాటు చేయడం జరిగింది. హెల్త్ విషయంలో ఏ సభ్యుడికి ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. ఈరోజు ఏ చిన్న టెస్ట్ చేయించాలనుకున్నా ఎంతో ఖర్చుతో కూడుకున్నదైంది.
అందుకోసమే మా` సభ్యుల కోసం ఉచితంగా ఈ హెల్త్ క్యాంప్‌లను నిర్వహించడం జరిగింది. ప్రతీ నెల రెండో ఆదివారం ఉచితంగా హెల్త్ క్యాంప్‌లను నిర్వహించడం జరుగుతుంది. మా` సభ్యుల ఆరోగ్యం మా ప్రధానాంశం. అందుకోసమే ఎప్పుడు ఆరోగ్యానికి సంబంధించి ఏ ఇబ్బంది వచ్చినా వెంటనే టెస్ట్‌లు ఉచితంగా చేయించుకోవడానికి మా` తరుపున డా.కె.వెంకటేశ్వరరావు (కె.వి.ఆర్)గారు అందుబాటులో ఉంటారు. అంతేకాకుండా ఈ హెల్త్ క్యాంప్‌కు సంబంధించి రెండు లక్షల భీమా సౌకర్యం కూడా మా` సభ్యులకు ఉందనే విషయాన్ని తెలియజేస్తున్నాను అన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments