Manchu Vishnu : మా ఫ్యామిలీపై ట్రోలింగ్ వెనుక ఆ హీరోనే.. 21 మందికి ఇదే పని : మంచు విష్ణు సంచలనం
Send us your feedback to audioarticles@vaarta.com
టాలీవుడ్ హీరో, మా అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు సంచలన వ్యాఖ్యలు చేశారు. సోషల్ మీడియా వేదికగా తనపైనా, తన కుటుంబంపైనా కొందరు ట్రోలింగ్‌కు పాల్పడుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. తన తాజా చిత్రం జిన్నా మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా మంగళవారం సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్స్‌తో మంచు విష్ణు ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తమ కుటుంబంపై నెగిటివ్ కామెంట్స్ చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. సైబర్ క్రైమ్ అధికారులకు త్వరలోనే ఫిర్యాదు చేస్తానని విష్ణు స్పష్టం చేశారు. ఈ ట్రోలింగ్ వెనుక జూబ్లీహిల్స్‌లో నివసించే ఓ హీరో వున్నాడని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ హీరోకు సంబంధించిన ఐటీ కంపెనీలో 21 మంది ఉద్యోగులు ట్రోల్ వీడియోలు అప్‌లోడ్ చేస్తున్నారని విష్ణు ఆరోపించారు. ఆఫీస్ చిరునామా, ఐపీ అడ్రస్‌లతో సహా పోలీసులకు అందజేస్తానని.. ఇన్నిరోజులు వదిలేశానని, ఇకపై వారిని క్షమించేది లేదని మంచు విష్ణు స్పష్టం చేశారు. తనను విమర్శించే వాళ్లకు ఇటీవలే ఆర్గానిక్‌గా పెద్ద దెబ్బపడిందని ఆయన పేర్కొన్నారు.
ట్రోలింగ్ చేయమని 21 మందికి ఉద్యోగాలు:
తాము ఫిర్యాదు చేసిన తర్వాతే తన మీద వస్తున్న ట్రోలింగ్స్ లో 85% రెండే ఐపీ అడ్రస్‌ల నుంచి వస్తున్నాయని విష్ణు తెలిపారు. అందులో ఒక ఐపీ అడ్రస్ జూబ్లీహిల్స్ లోని ఒక ప్రముఖ నటుడి నివాసం కాగా.. మరొకటి జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ వద్ద పనిచేస్తున్న ఒక ఐటీ ఆఫీస్ అని ఆయన చెప్పుకొచ్చారు. కేవలం తన కుటుంబాన్ని ట్రోల్ చేయడం కోసమే 21 మంది ఉద్యోగలను రిక్రూట్ చేసుకున్నారని మంచు విష్ణు ఆరోపించారు. అయితే సదరు నటుడు ఎవరనే విషయాన్ని శుక్రవారం మీడియా సమావేశం పెట్టి బయటపెడతానని ఆయన చెప్పారు. ప్రస్తుతం మంచు విష్ణు చేసిన వ్యాఖ్యలు ఫిలింనగర్‌లో తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. ఇంతకీ మంచు ఫ్యామిలీపై ట్రోలింగ్‌కు పాల్పడింది ఎవరో తెలియాలంటే శుక్రవారం వరకు వెయిట్ చేయాల్సిందే.
చిరు, నాగ్‌ల కోసం ‘జిన్నా’ వాయిదా :
ఇకపోతే.. మంచు విష్ణుగా నటించిన తాజా చిత్రం ‘జిన్నా’ విడుదలను వాయిదా పడింది. తొలుత ఈ సినిమాను అక్టోబర్ 5న రిలీజ్ చేయాలని దర్శక నిర్మాతలు నిర్ణయించారు. అయితే అదే రోజున చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్, నాగార్జున నటించని ఘోస్ట్ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. దీంతో చిత్ర పరిశ్రమ శ్రేయస్సు దృష్ట్యా జిన్నాను అక్టోబర్ 21కి వాయిదా వేశారు. ఈ చిత్రంలో విష్ణు సరసన బాలీవుడ్ హాట్ బాంబ్ సన్నీలియోన్, పాయల్ రాజ్‌పుత్‌లు నటించారు. ఈషాన్ సూర్య దర్శకత్వం వహించగా... ఏవా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లో మంచు విష్ణు నిర్మించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com