పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో 'మా ఊరి ప్రేమకథ'
Send us your feedback to audioarticles@vaarta.com
మంజునాథ్ హీరోగా 'శరణం గచ్ఛామి' ఫేమ్ తనిష్క తివారి హీరోయిన్గా శ్రీమల్లికార్జున స్వామి క్రియేషన్స్ పతాకంపై ఎస్.వి.ఎమ్. దర్శకత్వంలో రూపొందుతున్న గ్రామీణ ప్రేమకథా చిత్రం 'మా ఊరి ప్రేమకథ'. విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో జరిగే లవ్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందిన ఈ చిత్రం షూటింగ్ మొత్తం పూర్తి చేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుపుకుంటోంది.
హీరో కమ్ ప్రొడ్యూసర్ మంజునాథ్ మాట్లాడుతూ - ''రియలిస్టిక్ ఇన్సిడెంట్స్తో గ్రామీణ నేపథ్యంలో సాగే ప్రేమకథా చిత్రం. టైటిల్‌కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. కమర్షియల్ ఎలిమెంట్స్ అన్నీ ఈ చిత్రంలో వున్నాయి. సెంటిమెంట్, ఫ్యామిలీ ఎమోషన్స్, ఎంటర్టైన్మెంట్ ప్రేక్షకుల్ని ఆట్టుకుంటుంది. టెక్నికల్‌గా పెద్ద చిత్రాల స్థాయిలో ఈ చిత్రాన్ని ఎక్కడా కాంప్రమైజ్ అవకుండా రూపొందించాం. హీరోగా ఈ చిత్రం నాకు చాలా మంచి పేరు తెస్తుందని కాన్ఫిడెంట్‌గా వున్నాను. హీరోయిన్ తనిష్క తివారి చాలా బాగా నటించింది. చిత్రంలో ఐదు పాటలున్నాయి. జయసూర్య ఈ చిత్రానికి సూపర్ మ్యూజిక్‌నిచ్చారు. అద్భుతమైన లొకేషన్లలో సాంగ్స్‌ను షూట్ చేశాం. విజువల్‌గా కూడా చాలా బాగా వచ్చాయి. ఈ నెలలో ఓ ప్రముఖ హీరో చేతుల మీదుగా ఆడియో రిలీజ్ చేసి, జూలైలో సినిమా రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం'' అన్నారు.
మంజునాథ్, తనిష్క తివారి జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: జయసూర్య, కెమెరా: కళ్యాణ్ సమి, ఎడిటింగ్: ఆవుల వెంకటేష్, డ్యాన్స్: కిరణ్, ఫైట్స్: రియల్ సతీష్, ప్రొడక్షన్ మేనేజర్: వెంకటేష్, నిర్మాత: మంజునాథ్, కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: ఎస్.వి.ఎమ్.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com