ప్రొడ‌క్ష‌న్ చీఫ్ చిరంజీవి కుటుంబానికి 'మా' అసోసియేషన్ ఆర్ధిక సాయం

  • IndiaGlitz, [Tuesday,November 07 2017]

మంచి మ‌న‌సున్న మ‌నిషి శివాజీ రాజా. న‌టుడిగా ఎంత‌టి పేరు ప్ర‌ఖ్యాత‌లు సంపాదించారో..అంత‌కు మించి సేవా కార్య‌క్ర‌మాలు చేయ‌డంలో త‌న హృద‌యం ఏంట‌న్న‌ది చాటి చెప్పారు. 'మా' మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్ అధ్య‌క్షుడిగా బాధ్య‌త‌లు చెప‌ట్టిన త‌ర్వాత ఆ బాధ్య‌త మ‌రింత పెరిగింది. పేద క‌ళాకారుల‌కు..సాంకేతిక నిపుణుల‌కు...సినీ కార్మికుల‌కు నేడు శివాజీ అంటే ఓ ధైర్యం..భ‌రోసా. 24 శాఖ‌ల‌కు చెందిన అంద‌రి హృద‌యాల‌కు ద‌గ్గ‌రైన వ్య‌క్తి. స‌హాయం అంటూ ఆయ‌న్ను ఆశ్ర‌యిస్తే.... తప్ప‌క క‌ష్టాన్ని తీర్చే వ్య‌క్తి. అది ఆయ‌న సొంతంగా చేసినా? లేదా దాత‌ల నుంచి విరాళాల రూపంలో సేక‌రించింది కావ‌చ్చు.

కార‌ణం ఏదైనా క‌ష్టం తీరుతుంద‌నే శివాజీ అన్న‌య్యా అంటూ ఆయ‌న్ను ఆశ్ర‌యిస్తారు. అందుకే శివాజీ అంటే ఇండ‌స్ర్టీలో అంద‌రి లో త‌ల‌లో నాలుక లాంటి వార‌య్యారు. మ‌న‌సున్న మారాజుగా పేరు సంపాదించుకున్నారు. ఇప్ప‌టికే చాలా మంది పేద‌క‌ళాకారుల‌కు ప‌లు విధాలుగా..వివిధ రూపాల్లో ఆయ‌న స‌హాయం చేశారు.

తాజాగాఇటీవ‌ల ప్రొడ‌క్ష‌న్ చీఫ్ చిరంజీవి చ‌నిపోయిన నేప‌థ్యంలో అత‌ని కుటుంబానికి అండ‌గా నిల‌బ‌డ‌టానికి 'మా'మూవీ ఆర్టిస్ట్ త‌రుపున కొంత మంది ఆర్టిస్టులు..అలాగే 'అమ్మ‌మ్మ గారి ఇల్లు' చిత్ర నిర్మాతలు, న‌టీన‌టులు అంద‌రూ అండ‌గా నిల‌బ‌డ్డారు. త‌మ‌వంతుగా కొంత మొత్తాన్ని బాధిత కుటుంబానికి అంద‌జేశారు. మొత్తం 8ల‌క్ష‌ల రూపాయ‌లు వివిధ రూపాల్లో దాత‌ల నుంచి వ‌చ్చాయి.

అందులో మూడు సంవ‌త్స‌రాలకు 6ల‌క్ష‌ల రూపాయ‌ల‌ను ఆంధ్రాబ్యాంక్ లో చిరంజీవి పిల్ల‌ల పేరిట‌ ఫిక్స్ డు డిపాజిట్ చేశారు. మిగిలిన రెండు ల‌క్ష‌ల రూపాయ‌ల‌ను రెండు సంవ‌త్స‌రాల పాటు నెల‌కు 8వేల‌ చొప్పున అంద‌జేస్తున్నారు. అలాగే ఇటీవ‌ల జ‌రిగిన 'సంతోషం' అవార్డు ఫంక్ష‌న్ వేడుక‌ల్లో 40వేల రూపాయ‌ల‌ను చిరంజీవి కుటుంబానికి అందించారు. ఈ విరాళాల‌ను 'మా' అధ్య‌క్షులు శివాజీ రాజా చొర‌వ తీసుకుని సేక‌రించ‌డంతోనే సాధ్య‌మైంది.

ఈ సంద‌ర్భంగా శివాజీ రాజా మాట్లాడుతూ, " 'మా' అధ్య‌క్షులు శివాజీ రాజా మాట్లాడుతూ, 'ఇదంతా నా గ‌ప్పతనం కాదు. శివాజీ రాజా అంటే మంచి ప‌నులు చేస్తాడ‌ని అంద‌రూ విశ్వ‌సించారు కాబ‌ట్టే ఇలాంటివి చేయ‌గ‌ల్గుతున్నా. అలాగే నేను అడిగిన వెంట‌నే దాత‌లు కాద‌న‌కుండా వెంట‌నే స్పందించి స‌హాయం చేశారు కాబ‌ట్టే ఇవ‌న్నీ వీల‌వుతున్నాయి. నేను కేవ‌లం మ‌ధ్య వ‌ర్తిని మాత్ర‌మే. ఆవిధంగా సినీ ప‌రిశ్ర‌మ‌లో నేను అంద‌రి మ‌నిషిని అయ్యాను. ఇది నాకు చాలా సంతృప్తిని ఇస్తుంది" అని అన్నారు.

More News

ఒక్కడు మిగిలాడు కి నారా రోహిత్ వాయిస్ ఓవర్

అజయ్ ఆండ్రూస్ నూతక్కి దర్శకత్వంలో మంచు మనోజ్ హీరోగా  ప‌ద్మ‌జ ఫిలింస్ ఇండియా ప్రై.లి బ్యాన‌ర్‌ఫై రూపొందుతున్న చిత్రం 'ఒక్క‌డు మిగిలాడు'.

'ఖాకి' ఈ నెల 17న రిలీజ్‌!

స‌మాజానికి ర‌క్ష‌ణ క‌ల్పించ‌డంలో పోలీసుల త‌ర్వాతే ఎవ‌రైనా! వారు చేసే క‌ష్టానికీ, తీసుకునే జీతానికీ ఎక్క‌డా పొంత‌నే ఉండ‌దు. అయినా నిత్యం ప్ర‌జ‌ల సంర‌క్ష‌ణ‌కు పాటుప‌డుతుంటారు.

థియేట‌ర్స్ కాల్చేస్తామంటూ హెచ్చ‌రిక‌...

బాలీవుడ్ మూవీ ప‌ద్మావ‌తికి ఇబ్బందులు ఉత్తరాదినే కాదు..ద‌క్షిణాది కూడా త‌ప్పేలా క‌న‌ప‌డ‌టం లేదు. వివ‌రాల్లోకెళ్తే..హైద‌రాబాద్ గోషా మ‌హ‌ల్‌కు చెందిన ఎమ్మెల్యే రాజా సింగ్ సినిమా దర్శ‌కుడు సంజయ్ లీలా బ‌న్సాలీపై ఫైర్ అయ్యారు.

మ‌ళ్లీ ఐదేళ్ల త‌రువాత‌..

2013లో మూడు చిత్రాల‌తో సంద‌డి చేశారు సీనియ‌ర్ క‌థానాయ‌కుడు వెంక‌టేష్‌. వాటిలో రెండు చిత్రాలు మ‌ల్టీస్టార‌ర్ చిత్రాలు (సీత‌మ్మ వాకిట్లో సిరిమ‌ల్లె చెట్టు, మ‌సాలా) కాగా.. మ‌రొక‌టి సోలో హీరో మూవీ (షాడో).

ఎన్టీఆర్ సింగ‌ర్‌.. రెండు సినిమాలు

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ న‌టించిన రాఖీ సినిమాలోని జ‌ర‌జ‌ర పాకే విషంలా.. అంటూ సాగే పాట ఎంత పెద్ద హిట్టో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు.