'మా' ఎన్నికలు: బీజేపీదే అధికారం.. సీవీఎల్ వ్యాఖ్యలు హాట్ టాపిక్
Send us your feedback to audioarticles@vaarta.com
ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ సీవీఎల్ నరసింహారావు 'మా'ఎన్నికల్లో అధ్యక్ష అభ్యర్థిగా పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఆయన తెలంగాణ వాదంతో ఎన్నికల బరిలో దిగుతున్నారు. మా అసోసియేషన్, టాలీవుడ్ లో తెలంగాణ ఆర్టిస్టులకు అన్యాయం జరుగుతోందని సీవీఎల్ ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే.
ఏపీలో కూడా పేద ఆర్టిస్టులకు న్యాయం జరగడం లేదు. మా అసోసియేషన్ ని ఏపీ, తెలంగాణ రెండుగా విభజించాలి అనే డిమాండ్ తో సీవీఎల్ మా ఎన్నికల బరిలోకి దిగారు. సివిల్ నరసింహారావు బిజెపి మద్దతు దారుడు. బిజెపి కూడా నరసింహారావుకు మా ఎన్నికలో మద్దతు తెలిపింది.
తాజాగా సివిఎల్ తెలంగాణ బిజెపి నేతలతో కలసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ మీడియా సమావేశంలో బిజెపి నేత వెంకటరమణి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మా ఎన్నికలపై వారు చేసిన రాజకీయ వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి.
మా ఎన్నికల్లో రాజకీయ కోణం తెరపైకి వస్తోందా అనే అనుమానాలు కలుగుతున్నాయి. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఒక్కసారి కూడా ప్రభుత్వం నంది అవార్డులు ఇవ్వలేదని వెంకట రమణి విమర్శించారు. నంది అవార్డులు ఎందుకు ఇవ్వలేదో సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని సమాధానం చెప్పాలని అన్నారు.
ఇక సివిఎల్ మాట్లాడుతూ ఇంకాస్త ఆసక్తికర రాజకీయ వ్యాఖ్యలు చేశారు. 2023లో తెలంగాణాలో అధికారంలోకి వచ్చేది బీజేపీ నే అని అన్నారు. బిజెపి ప్రభుత్వం వచ్చాక అంతర్జాతీయ ఫిలిం, టెలివిజన్ ఇన్స్టిట్యూట్ లు ఏర్పాటు చేస్తాం అని అన్నారు. తెలంగాణ సినిమాలకు వినోదపు పన్ను మినహాయింపు ఉంటుందని, అలాగే ప్రతి తెలంగాణ సినిమాకు రూ 50 లక్షల వరకు సబ్సిడీ ఇస్తామని హామీ ఇచ్చారు సివిఎల్ నరసింహా రావు.
త్వరలో జరగబోయే మా ఎన్నికల్లో అధ్యక్ష పదవి కోసం సివిఎల్.. ప్రకాష్ రాజ్, మంచు విష్ణు, జీవిత లతో తలపడబోతున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments