పోస్టల్ బ్యాలెట్లతో కుట్ర: విష్ణు ప్యానెల్‌పై ఫిర్యాదు, ఎన్నికల తీరుపై ప్రెస్‌మీట్‌లో ప్రకాశ్‌రాజ్ కన్నీళ్లు
Send us your feedback to audioarticles@vaarta.com
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ‘‘మా’’ ఎన్నికల వార్ హోరాహోరీగా నడుస్తుంది. ఇప్పటికే రెండు ప్యానెల్స్ ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ మా ఎన్నికలను సాధారణ ఎన్నికలుగా మార్చేస్తున్నారు. మా.. ఎన్నికల తేదీ దగ్గర పడుతున్న కొద్దీ రోజు రోజుకీ ఉత్కంఠ తారాస్థాయికి చేరుతోంది. అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న ప్రకాష్ రాజ్ – మంచు విష్ణు ప్యానెల్ సభ్యులు ప్రెస్‌మీట్లు పెట్టి ఒకరిపై ఒకరు ఘాటు విమర్శలు చేసుకుంటున్నారు. ప్రధానంగా నరేష్ – ప్రకాష్ రాజ్ – విష్ణు- జీవితల మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. నిన్న మీడియా ముందుకు వచ్చిన జీవిత.. తననే ఈ ప్రపంచం ఎందుకు టార్గెట్ చేస్తుందో అర్థం కావడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా గత ప్యానెల్ ఎలాంటి కార్యక్రమాలు చేపట్టింది.. తన ప్రతిపాదనలకు కొందరు ఎలా అడ్డు తగిలారో ఆమె వెల్లడించారు.
తాజాగా మంగళవారం ప్రకాష్ రాజ్ మీడియాతో మాట్లాడుతూ.. మంచు విష్ణుపై సంచలన ఆరోపణలు చేశారు. పోస్టల్ బ్యాలెట్లతో విష్ణు కుట్ర చేస్తున్నారని ప్రకాష్ రాజ్ వ్యాఖ్యానించారు. ఒక వ్యక్తికి 56 మంది డబ్బులు ఇచ్చారని.. తనకు అనుకూలంగా ఓటు వేయాలని కోరారని ఆయన ఆరోపించారు. ఈ వ్యవహారంపై మంగళవారం ఆయన మా ఎన్నికల అధికారికి ప్రకాష్ రాజ్ ఫిర్యాదు చేశారు. ఏజెంట్ల ద్వారా పోస్టల్ బ్యాలెట్‌లో కుట్ర చేస్తున్నారని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
60 ఏళ్లు పైబడిన నటీనటులు పోస్టల్ బ్యాలెట్‌కు అర్హులని.. అర్హత ఉన్న సభ్యుల నుంచి విష్ణు ప్యానెల్ సంతకాలు సేకరిస్తోందని ప్రకాశ్ రాజ్ చెప్పారు. నిన్న సాయంత్రం విష్ణు తరఫున ఓ వ్యక్తి 56 మంది సభ్యుల తరఫున రూ.28 వేలు కట్టారని.. ఆయన కడితే ఇక్కడ ఎలా తీసుకున్నారు అని ప్రకాశ్ రాజ్ ప్రశ్నించారు. కృష్ణ, కృష్ణంరాజు, శారద, పరుచూరి బ్రదర్స్, శరత్‌బాబు తదితరుల పోస్టల్ బ్యాలెట్ డబ్బులు కూడా మంచు విష్ణు తరఫు వ్యక్తే కట్టారని ఆరోపించారు. ఆగంతుకులతో ‘మా’ ఎన్నికలు నిర్వహిస్తామా?ఇలా గెలుస్తారా?మీ హామీలు చెప్పి గెలవరా? ఇంత దిగజారుతారా? ఈ విషయంపై పెద్దలు కృష్ణంరాజు, చిరంజీవి, నాగార్జున స్పందించాలని ప్రకాశ్ రాజ్ డిమాండ్ చేశారు. అదే సమయంలో మా ఎన్నికలు జరుగుతున్న తీరుపై ప్రకాష్ రాజ్ ప్రెస్ మీట్‌లో కంటతడి పెట్టారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments