బ్యాలెట్ పేపర్ల వ్యవహారం: ప్రకాష్‌రాజ్ ప్యానెల్ ఆరోపణలపై ‘‘ మా ’’ ఎన్నికల అధికారి వివరణ
Send us your feedback to audioarticles@vaarta.com
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ‘‘మా’’ ఎన్నికలు ముగిసినప్పటికీ వివాదాలు, విమర్శలకు మాత్రం ఫుల్స్టాప్ పడకపోగా.. మరింత పెరిగాయి. ముఖ్యంగా ఎన్నికలు జరిగిన తీరు, కౌంటింగ్, మోహన్ బాబు ప్రవర్తన తదితర అంశాలపై నొచ్చుకున్న ప్రకాశ్ రాజ్ తన ప్యానెల్ నుంచి గెలిచిన 11 మంది సభ్యులతో రాజీనామా చేయించి కొత్త వివాదానికి తెరదీశారు. ఇదే సమయంలో కౌంటింగ్ సందర్భంగా అవకతవకలు జరిగాయని ప్రకాశ్ రాజ్ ప్రెస్మీట్లో ఆరోపించారు.
ఇక ప్రకాశ్‌రాజ్ ప్యానెల్ నుంచి ఈసీ మెంబర్‌గా పోటీ చేసిన స్టార్ యాంకర్ అనసూయ ఓటమి పాలయ్యారు. అయితే ఆదివారం ఓట్ల లెక్కింపు సందర్భంగా ఆమె విజయం సాధించినట్లుగా మీడియాలో కథనాలు వచ్చాయి. ఆ తర్వాత ఓట్ల లెక్కింపు మరుసటి రోజుకు వాయిదా పడటంతో ఆమె ఫలితంపై సందిగ్ధత నెలకొంది. అయితే మరుసటి రోజు జరిగిన ఓట్ల లెక్కింపులో అనసూయ ఓడిపోయినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. దీంతో అనసూయతో పాటు ప్రకాశ్ రాజ్ ప్యానెల్ షాక్‌కు గురైంది. దీనిపై ‘‘రాత్రికి రాత్రి ఏం జరిగుంటుందబ్బా’’ అంటూ ఆమె సెటైరికల్‌గా ట్వీట్ చేశారు. నిన్నటి ప్రెస్‌మీట్ సందర్భంగా ఈటీవీ ప్రభాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల అధికారి బ్యాలట్ పేపర్లను ఇంటికి తీసుకెళ్లారని ప్రభాకర్ ఆరోపించారు.
ఈ నేపథ్యంలో మా ఎన్నికల అధికారి కృష్ణమోహన్ స్పందించారు. అనసూయ భారీ మెజార్టీతో గెలిచిందనే వార్తల్లో నిజం లేదని ఆయన స్పష్టం చేశారు. తాము అధికారికంగా అనౌన్స్ చేయడానికి ముందే ఆమె గెలిచినట్టు మీడియాలో ప్రచారం జరిగిందని కృష్ణమోహన్ చెప్పారు. అలాగే తాను బ్యాలెట్ పేపర్లను ఇంటికి తీసుకెళ్లానని చేసిన ఆరోపణలను ఆయన ఖండించారు. బ్యాలెట్ పేపర్లను ఉంచిన బాక్స్‌ల తాళాలను మాత్రమే తాను ఇంటికి తీసుకెళ్లానని కృష్ణమోహన్ స్పష్టం చేశారు. ఇక మా అసోసియేషన్ సభ్యత్వానికి ప్రకాశ్ రాజ్ రాజీనామా చేయడం ఆయన వ్యక్తిగత విషయమని కృష్ణమోహన్ అన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout