రికార్డ్ స్థాయిలో ముగిసిన ‘మా’ ఎన్నికల పోలింగ్..

  • IndiaGlitz, [Sunday,March 10 2019]

‘మా’ (మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్) ఎన్నికల పోలింగ్ ముగిసింది. గత పది రోజులగా నెలకొన్న తీవ్ర ఉత్కంఠకు 50శాతం తెరపడింది. ఆ ఫలితాలు కాస్త విడుదలైతే ఇక మళ్లీ వచ్చే ఎన్నికల వరకూ ఎలాంటి ‘మా’ ఎన్నికలు అనే మాట వినపడదు. ఆదివారం ఉదయం 8గంటలకు ప్రారంభమైన పోలింగ్.. మధ్యాహ్నం 3గంటల వరకు సాగింది. మొదట మధ్యాహ్నం రెండు గంటల వరకే పోలింగ్ అనుకున్నప్పటికీ ఓటేయడానికి సభ్యులంతా పెద్ద ఎత్తున తరలిరావడం.. లిఫ్ట్ సమస్య రావడం, ఇలా చిన్నపాటి సమస్యలు రావడంతో మరో గంట పోలింగ్‌‌ను పొడిగించడం జరిగింది.

కాగా.. పోలింగ్ ప్రక్రియ పూర్తయ్యే వరకు మొత్తం 472 పోలయ్యాయని అధికారిక ప్రకటన వచ్చింది. ‘మా’లో మొత్తం 745 మందికి ఓట్లున్నాయి. 472 మంది ఓట్లు వినియోగించుకోగా.. 273 మంది ఓటు హక్కు వినియోగించుకోలేదు. ఇదిలా ఉంటే ‘మా’ చరిత్రలో ఇన్ని ఓట్లు పోలవ్వడం ఇదే ఫస్ట్ టైమ్. ఒక్కమాటలో చెప్పాలంటే ‘మా’ హిస్టరీ క్రియేట్ చేశారని చెప్పుకోవచ్చు. ఈ ఎన్నికల్లో.. మా బరిలో ఉన్న నరేశ్ మొదటి ఓటు వేయగా.. చిట్టిబాబు చివరి ఓటు వేశారు.

4 నుంచి కౌంటింగ్...

మూడు గంటలకు పోలింగ్ ప్రక్రియ ముగియగా.. 4 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభం కానుంది. రాత్రి 8గంటల కల్లా ఫలితాలు వెలువడే అవకాశాలు మెండుగా ఉన్నాయి. రెండోసారి శివాజీకి పీఠం దక్కుతుందా..? లేకుంటే నరేశ్‌‌కు పీఠం దక్కుతుందా అనేది తెలియాలంటే మరో నాలుగు గంటలు వేచి చూడాల్సిందే మరి.

More News

కుప్పకూలిన విమానం.. 157 మంది దుర్మరణం..!?

థియోపియన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన 737 విమానం(ET 302) ఒకటి కుప్పకూలింది. అదిస్ అబాబా నుంచి నైరోబీకి వెళ్తున్న విమానం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది.

వైసీపీ ఎఫెక్ట్.. ఆ పార్టీ గుర్తు పక్కనెట్టిన ఎన్నికల కమిషన్!

ఏపీలో త్వరలో జరగనున్న ఎన్నికల్లో టీడీపీ, వైసీపీ, జనసేన, కాంగ్రెస్, బీజేపీలతో పాటు ప్రజాశాంతి పార్టీ కూడా తలపడుతున్న సంగతి తెలిసిందే.

టాలీవుడ్‌‌లో ట్రెండ్ సెట్ చేస్తున్న ‘96’ బ్యాక్‌డ్రాప్!

ప్రేమ తాలూకు జ్ఞాపకాల్ని గుర్తుకు తెస్తూ హృద్యమైన ఇతివృత్తంతో రూపొందిన తమిళ చిత్రం ‘96’ ఘన విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.

నీరవ్ మోదీ నోట.. నో కామెంట్.. 8 లక్షల జాకెట్!

పంజాబ్ నేషనల్ బ్యాంకులో జరిగిన వేల కోట్లరూపాయిల కుంభకోణంలో ప్రధాన నిందితుడైన వ్యాపారవేత్త నీరవ్ మోదీ ఇండియా వదిలి పారిపోయిన సంగతి తెలిసిందే.

కాంగ్రెస్‌కు టాటా చెప్పి కారెక్కనున్న సబితా.. ఎంపీ టికెట్ ఫిక్స్!

తెలంగాణ ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు కోలుకోలేని ఎదురుదెబ్బ తగలడంతో.. పార్లమెంట్ ఎన్నికల్లో తమ సత్తా ఏంటో చూపించాలని అధిష్టానం సమాయత్తమవుతోంది.