రికార్డ్ స్థాయిలో ముగిసిన ‘మా’ ఎన్నికల పోలింగ్..
Send us your feedback to audioarticles@vaarta.com
‘మా’ (మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్) ఎన్నికల పోలింగ్ ముగిసింది. గత పది రోజులగా నెలకొన్న తీవ్ర ఉత్కంఠకు 50శాతం తెరపడింది. ఆ ఫలితాలు కాస్త విడుదలైతే ఇక మళ్లీ వచ్చే ఎన్నికల వరకూ ఎలాంటి ‘మా’ ఎన్నికలు అనే మాట వినపడదు. ఆదివారం ఉదయం 8గంటలకు ప్రారంభమైన పోలింగ్.. మధ్యాహ్నం 3గంటల వరకు సాగింది. మొదట మధ్యాహ్నం రెండు గంటల వరకే పోలింగ్ అనుకున్నప్పటికీ ఓటేయడానికి సభ్యులంతా పెద్ద ఎత్తున తరలిరావడం.. లిఫ్ట్ సమస్య రావడం, ఇలా చిన్నపాటి సమస్యలు రావడంతో మరో గంట పోలింగ్‌ను పొడిగించడం జరిగింది.
కాగా.. పోలింగ్ ప్రక్రియ పూర్తయ్యే వరకు మొత్తం 472 పోలయ్యాయని అధికారిక ప్రకటన వచ్చింది. ‘మా’లో మొత్తం 745 మందికి ఓట్లున్నాయి. 472 మంది ఓట్లు వినియోగించుకోగా.. 273 మంది ఓటు హక్కు వినియోగించుకోలేదు. ఇదిలా ఉంటే ‘మా’ చరిత్రలో ఇన్ని ఓట్లు పోలవ్వడం ఇదే ఫస్ట్ టైమ్. ఒక్కమాటలో చెప్పాలంటే ‘మా’ హిస్టరీ క్రియేట్ చేశారని చెప్పుకోవచ్చు. ఈ ఎన్నికల్లో.. మా బరిలో ఉన్న నరేశ్ మొదటి ఓటు వేయగా.. చిట్టిబాబు చివరి ఓటు వేశారు.
4 నుంచి కౌంటింగ్...
మూడు గంటలకు పోలింగ్ ప్రక్రియ ముగియగా.. 4 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభం కానుంది. రాత్రి 8గంటల కల్లా ఫలితాలు వెలువడే అవకాశాలు మెండుగా ఉన్నాయి. రెండోసారి శివాజీకి పీఠం దక్కుతుందా..? లేకుంటే నరేశ్‌కు పీఠం దక్కుతుందా అనేది తెలియాలంటే మరో నాలుగు గంటలు వేచి చూడాల్సిందే మరి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments