వీర జవాన్ల కుటుంబాలకు 'మా' వంతు సాయం

  • IndiaGlitz, [Monday,February 18 2019]

పుల్వామా దాడిలో అమరులైన జవాన్ల కుటుంబాలను ఆదుకునేందుకు భారతదేశంలోని పలువురు ప్రముఖలు, పలు రాష్ట్రాల ప్రభుత్వాలు, పౌరులు, హీరోలు పెద్ద మనసుతో తమవంతుగా విరాళం ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా 'మా' (మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్) ముందుకొచ్చింది. 'మా' వంతుగా రూ. 5లక్షల విరాళాన్ని ఇస్తున్నట్లు ప్రకటించింది.

విరాళం ప్రకటించిన అనంతరం 'మా' పెద్దలు మీడియాతో మాట్లాడుతూ..జవాన్ల త్యాగం మరువలేనిది. ఉగ్రవాదాన్ని అణచివేసేందుకు కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలి అని మా అధ్యక్షుడు శివాజీరాజా, జనరల్ సెక్రెటరీ డాక్టర్ వి. కె నరేష్ తెలిపారు. కాగా.. ఉగ్రమూకల దాడిలో అమరులైన జవాన్ల కుటుంబాలను ఆదుకునేందుకు ఇప్పటికే చాలా మంది సినీ పరిశ్రమ నుంచి ముందుకొచ్చి సాయం ప్రకటించిన విషయం విదితమే. కాగా ఈ దాడి జరిగిన మరోక్షణమే పాక్‌‌పై పలువురు నటీనటుమణులు సోషల్ మీడియా వేదికగా తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అమరుల కుటుంబాలకు అన్ని విధాలా తాము అండగా ఉంటామని ధైర్యం చెబుతూ విరాళాలు ప్రకటించారు. 

కాగా.. జమ్మూకశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో సీఆర్పీఎఫ్ కాన్వాయ్‌పై జైషే ఉగ్రవాది కారు బాంబుతో దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ దాడిలో 40 మంది జవాన్లు అమరులయ్యారు. ఉగ్రదాడిలో కేవలం ఒక వ్యక్తి(ఆత్మాహుతికి పాల్పడ్డ ఉగ్రవాది) కారణంగా ఇంత భారీ మొత్తంలో జవాన్లు మరణించడం ఇదే తొలిసారి. జవాన్లపై దాడి విషయం తెలిసి యావత్తు భారతావని కన్నీరు పెడుతోంది. మరోవైపు ప్రతీకారం తీర్చుకునేందుకు ఇండియన్ ఆర్మీ సన్నాహాలు చేస్తోంది. త్వరలోనే సర్జికల్ స్ట్రైక్స్-2 జరిగే అవకాశాలు మెండుగా ఉన్నాయి.

More News

హీరో గోపిచంద్‌‌కు రోడ్డు ప్రమాదం

హీరో గోపిచంద్ మరోసారి షూటింగ్‌‌లో గాయపడ్డారు. తిరు దర్శకత్వంలో అనిల్ సుంకర్ నిర్మిస్తొన్న భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ చిత్రం ప్రస్తుతం జైపూర్ (రాజస్థాన్) దగ్గర మాండవలో చిత్రీకరణ జరుపుకుంటోంది.

కేసీఆర్ కేబినెట్‌‌ నుంచి హరీశ్, కేటీఆర్, ఈటెల ఔట్!

తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటై రెండు నెలలు పూర్తవుతున్నా ఇంత వరకూ కేబినెట్ ఏర్పాటు చేయాలేదే అపవాదును సీఎం కేసీఆర్ తుడుపుకుంటూ విస్తరణకు ముహూర్తం ఫిక్స్ చేసిన సంగతి తెలిసిందే.

వైసీపీలోకి మరో సిట్టింగ్ ఎంపీ

గత కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్‌‌లో చోటుచేసుకుంటున్న రాజకీయ పరిణామాలను బట్టి చూస్తే టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబుకు ‘బ్యాడ్ టైమ్’ స్టార్ట్ అయ్యిందని స్పష్టంగా అర్థమవుతోంది!.

పాక్ క‌ళాకారుల‌ను బ్యాన్ చేసిన బాలీవుడ్‌

పుల్వామా ఉగ్ర‌దాడి ఫ‌లితం పాక్‌పై చాలా బాగానే ప్ర‌భావం చూపుతుంది. ఒక‌వైపు రాజకీయ ఒత్తిళ్ల‌ను పాకిస్థాన్ ఎదుర్కొంటుంది. ఇప్పుడు సినిమా రంగం.. బాలీవుడ్ కూడా పాకిస్థానీ క‌ళాకారుల‌ను బ్యాన్ చేసింది.

రీమేక్ ఆలోచ‌న‌లో అల్లు అర‌వింద్‌

టాలీవుడ్ ఏస్ ప్రొడ్యూస‌ర్స్‌లో ఒక‌రైన అల్లు అర‌వింద్.. రీసెంట్‌గా విడుద‌లై ఘ‌న విజ‌యాన్ని న‌మోదు చేసుకుంటున్న గ‌ల్లీబాయ్స్ చిత్రాన్ని తెలుగులో