గీతాంజలి మృతి ‘మా’కు తీరని లోటు!
Send us your feedback to audioarticles@vaarta.com
టాలీవుడ్ సీనియర్ నటి గీతాంజలి కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా గుండెపోటుతో బాధపడుతున్న ఆమె హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రిలో పొందుతూ గురువారం తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు. తమ తోటి నటి ఇక లేరన్న విషయం తెలుసుకున్న టాలీవుడ్ పెద్దలు నిర్ఘాంతపోయారు. హైదరాబాద్‌లో ఉన్న పలువురు సీనియర్ నటీనటులు పెద్ద ఎత్తున అపోలో ఆస్పత్రికి చేరుకుని గీతాంజలి భౌతికకాయానికి నివాళులు అర్పించి.. ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆమె మృతికి ‘మా’ అసోసియేషన్ కార్యనిర్వాహక ఉపాధ్యక్షులు డాక్టర్ రాజశేఖర్, ప్రధాన కార్యదర్శి జీవిత, ఇతర కార్యవర్గ సభ్యులు సంతాపం తెలిపారు. ఈ సందర్భంగా ‘మా’ తరఫున ఓ ప్రకటన విడుదల చేశారు.
‘మా’కు తీరని లోటు!
‘ఐదు దశాబ్దాలకు పైగా దక్షిణ భారత చలన చిత్ర సీమలో 300కు పైగా చిత్రాలలో నటించి కథానాయికగా, హాస్యనటిగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా గీతాంజలి తనదైన ముద్రను వేశారు. నటిగానే కాకుండా మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్‌కు ఎంతోకాలంగా సేవలందిస్తున్నారు. ఆమె మృతి చిత్రసీమకే కాకుండా, మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్‌కు తీరని లోటు’ అని రాజశేఖర్, ప్రధాన కార్యదర్శి జీవిత, ఇతర కార్యవర్గ సభ్యులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా గీతాంజలి మృతికి తీవ్ర సంతాపం తెలియజేస్తూ, ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments