రాజశేఖర్ రాజీనామా‌కు ‘మా’ ఆమోదం

  • IndiaGlitz, [Monday,January 06 2020]

టాలీవుడ్‌ యాంగ్రీస్టార్ రాజశేఖర్‌ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ డైరీ ఆవిష్కరణలో భాగంగా జరిగిన మాటల యుద్ధం అనంతరం రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆ రాజీనామాను ‘మా’ అసోసియేషన్ అమోదించింది. ఈ మేరకు రాజశేఖర్ రాజీనామాను ఆమోదిస్తున్నట్లు ఓ ప్రకటన విడుదల చేసింది. ఇందుకు సంబంధించి మీటింగ్‌ ఏర్పాటు చేసుకుని మాట్లాడిన తర్వాత ఫైనల్‌గా ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందని ప్రకటనలో పేర్కొన్నారు.

ఇదిలా ఉంటే.. మా అడ్వజైర్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిటిలో కృష్ణం రాజు, మెగాస్టార్ చిరంజీవి, మురళీ మోహన్, సీనియర్ నటి జయసుధను నియమిస్తున్నట్లు ఎలక్షన్ కమిషన్ పేర్కొంది. కాగా ఈ రాజీనామా ఆమోదం, అడ్వైజర్‌ కమిటీ ప్రకటనపై కృష్ణం రాజు, మా అధ్యక్షుడు నరేశ్ సంతకాలు చేశారు.

కాగా.. మా డైరీ ఆవిష్కరణలో చిరు వర్సెస్ రాజశేఖర్‌గా పరిస్థితులు మారగా.. స్ట్రాంగ్ యాక్షన్ తీసుకోవాలని మెగాస్టార్ కోరిన సంగతి తెలిసిందే. అయితే ఈ యాక్షన్ తీసుకునే లోపే రాజశేఖర్ కొన్ని గంటల వ్యవధిలోనే రాజీనామా చేయడం.. ఆ తర్వాత చిరుకు సారీ చెప్పడం చకచకా జరిగిపోయింది. మరి రాజశేఖర్ రాజీనామా ఆమోదించారు సరే వాట్ నెక్స్ట్ అనేది మాత్రం తెలియరాలేదు.