మహిళలకు క్షమాపణలు తెలిపిన 'మా'
- IndiaGlitz, [Tuesday,May 23 2017]
ఇటీవల ఓ ఆడియో వేడుకలో సీనియర్ నటుడు చలపతిరావు మహిళలను కించ పరిచి మాట్లాడిన మాటలు ఎంతటి దుమారం రేపాయో తేలిసిందే. అనంతరం ఆయన మహిలలకు క్షమాపణలు కూడా తెలిపారు. 'మా' (మూవీ ఆర్టిస్ట్ అసో సియేషన్ సంఘం) కూడా మంగళవారం సాయంత్రం మీడియా సమక్షంలో ఆయన తరుపున క్షమాపణలు తెలియజేసింది.
ఈ సందర్భంగా 'మా' అధ్యక్షులు శివాజీ రాజా మాట్లాడుతూ, ' చలపతిరావు గారు గతంలో ఎప్పుడు ఇలాంటి వ్యాఖ్యలు ఎక్కడా చేయలేదు. షూటింగ్ స్పాట్ లో అందరితో సరదగా ఉంటారు. నలుగురికి మంచి వ్యాఖ్యలే చెబుతారు. కానీ తొలిసారి ఆయన నోరు జారారు. తర్వాత ఆయన నాతో మాట్లాడి చాలా బాధపడ్డారు. మహిళలు గురించి ఆయన అలా మాట్లాడటం తప్పు అని 'మా' కూడా ఖండిస్తుంది. క్షమించిమని చాలా బాధతో అడిగారు. ఇకపై ఆర్టిస్టుల తరుపు నుంచి ఇలాంటి ఇబ్బందికరమైన వ్యాఖ్యలు రావని మాటిస్తున్నాం. ఇలాంటివి మళ్లీ పునరావృతం అయితే తక్షణం వారిపై చర్యలు తీసుకుంటాం. మూవీ ఆర్టిస్ట్ మెంబర్ షిప్ ను తొలగిస్తాం. మహిళా సంఘాలకు కూడా చలపతి రావుగారు క్షమాపణలు చెప్పారు. ఈ ప్రెస్ మీట్ కూడా వచ్చి సభాముఖంగా క్షమాపణలు చెబుతనన్నారు. కానీ మేము కాదనడంతో రాలేదు' అని అన్నారు.
'మా' జనరల్ సెక్రటరీ నరేష్ మాట్లాడుతూ, ' చలపతిరావు గారి వ్యాఖ్యలపై 'మా' , సినిమా ఇండస్ర్టీ నుంచి ముక్తకంఠంతో ఖండిస్తున్నాం. సినీ పరిశ్రమలో కూడా మహిళలున్నారు. అంతా కలిసి పనిచేస్తాం. అయితే ఒక సభలో సభా మర్యాద, సమన్యాయం పాటించడం చాలా అవసరం. ఏ కార్యక్రమైనా జోకులతో నే ప్రారంభం అవుతుంది. అయితే కొంత మంది నటులు హాస్యానికి- ఇలాంటి వ్యాఖ్యలకు మధ్య చిన్న మంచు పొర ఉంటుంది దాన్ని గ్రహించక అదుపు తప్పి ఏవో మాట్లాడుతున్నారు. అవి సోషల్ మీడియాలో దుమారం అవ్వడం జరుగుతుంది. ఇది 'మా' కు కూడా ఓ గుణపాఠం. ఎవరి వ్యక్తి గత విషయాలు వాళ్లకు ఉంటాయి. కానీ సభలో ఉన్నప్పుడు మాత్రం బాధ్యతగా మాట్లాడాల్సి ఉంటుంది. ఇలాంటి ఇబ్బందికర వ్యాఖ్యలు చోటు చేసుకోకుండా చూడటం 'మా' బాధ్యత కూడా. అందుకే మహిళలందరికీ మా తరుపున, చలపతిరావు గారు తరుపున క్షమాపణలు తెలుపుతున్నాం. చలపతిరావు గారు ఇప్పుడు షాక్ లో ఉన్నారు. క్షమించండని చానెల్స్ కు వెళ్లి మాట్లాడుతున్నారు. సీనియర్ నటుడిగా, ఇన్నేళ్ల పాటు ప్రేక్షకులను అలరించిన వ్యక్తి కాబట్టి క్షమించండని కోరుతున్నాం. రానున్న రోజుల్లో జనరల్ బాడీలో కూడా ఓ రిజల్యుషన్ తీసుకొస్తాం. ఆర్టిస్టులు ఎవరైనా ఇబ్బందికర వ్యాఖ్యలు చేస్తే వారిపై చర్యలు తీసుకుంటాం. చలపతిరావు గారిపై కేసులు బనాయించిన వారిని వెంటనే కేసు వెనక్కి తీసుకోవాల్సిందిగా ప్రార్ధిస్తున్నాం. గతంలో ఇలాంటి పరిస్థితులు చోటుచేసుకోవడం అవి 'మా' దగ్గరకు రావడం.. వెంటనే వాళ్లను హెచ్చరించడం కూడా జరిగింది. మళ్లీ ఇలా జరగడం బాధాకరం ' అని అన్నారు.
ఈ సమావేశంలో జాయింట్ సెక్రటరీ ఏడిద శ్రీరామ్, ఈసీ మెంబర్ సురేష్ కొండేటి పాల్గొన్నారు.