చెన్నైవరద బాధితులకు 5 లక్షల విరాళం ప్రకటించిన మా
Send us your feedback to audioarticles@vaarta.com
చెన్నైవరద బాధితుల కోసం మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ 5 లక్షల ఆర్ధిక సహాయం ప్రకటించింది. చెన్నై నగరానికి వచ్చిన కష్టానికి యువ హీరోలు స్పందించి వారికి తోచినంత సహాయం అందిస్తుండడం చూస్తుంటే నిజంగా గర్వంగా ఉంది అంటున్నారు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్. ఈ సందర్భంగా ఫిలిం ఛాంబర్లో ఏర్పాటు చేసిన మీడియా మీట్ లో
మా అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ..
చెన్నైలోనే మా బతుకులు ప్రారంభమయ్యాయి. అక్కడే పెరిగాం. అలాంటి చెన్నై నగరానికి కష్టం వచ్చిందంటే వారం రోజుల నుంచి భోజనం చేయాలనిపించడం లేదు. చెన్నై తెలుగు సినిమాకి తల్లి లాంటిది.మా ముందు తరంలో ఎన్టీఆర్, ఎ.ఎన్.ఆర్ ఇలాంటి కష్టం వచ్చినప్పుడు జోళులు పట్టి విరాళాలు సేకరించారు. మా తరంలో క్రికెట్, స్పెషల్ స్టేజ్ ప్రాగ్రామ్స్ ఏర్పాటు చేసి విరాళాలు సేకరించాం. ఈతరంలో ఒకరికి మించి ఒకరు సహాయం చేస్తుండడం ఆనందంగా ఉంది.మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ తరుపున 5 లక్షలు ఆర్ధిక సహాయం చేస్తున్నాం. త్వరలో అక్కడకి వెళ్లి సేవా కార్యక్రమాలు చేస్తాం అన్నారు.
శివాజీరాజా మాట్లాడుతూ...చిన్నప్పటి నుంచి హైదరాబాద్ లో చదువుకున్నా...కెరీర్ స్టార్ట్ చేసింది మాత్రం మద్రాసులోనే. అందుకనే చెన్నై అంటే ప్రత్యేకమైన అభిమానం.86,87 లో చెన్నైలో బ్యాచిలర్స్ గా ఉన్నప్పుడు వరదలు వస్తే భోజనానికి చాలా ఇబ్బంది పడ్డాం.మనకు కష్టం వచ్చినప్పుడు వాళ్లు స్పందించేవారు. వాళ్ళకి కష్టం వచ్చినప్పుడు మన వాళ్లు ఎవరికి తోచినంత సహాయం చేస్తున్నారు. చెన్నై వెళ్లడానికి ప్రయత్నిస్తున్నాం. త్వరలోనే అక్కడకి వెళ్లి సేవా కార్యక్రమాలు చేస్తాం అన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout